ANDHRA PRADESHSTATE NEWS
నిలువ నీడ లేక ప్రయాణికుల కష్టాలు

నిలువ నీడ లేక ప్రయాణికులకు కష్టాలు
కొత్తపల్లి యువతరం విలేఖరి;
మండలంలోని ఎర్రమటంలో ఇతర గ్రామాలకు వెళ్లే ప్రయాణికులకు వాహనాలు వచ్చే వరకు నిలబడటానికి బస్సు షెల్టర్ లేక ఊరు చివరన నిర్మించిన బస్సు షెల్టర్ శిథిలావస్థకు చేరడంతో నిలబడటానికి నీడ లేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాహనాలు వచ్చేవరకు ఎండలోనే నిలబడవలసి వస్తుందని సంబంధిత అధికారులు స్పందించి మా గ్రామం నందు బస్సు షెల్టర్ నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.