అభివృద్ధి పథంలో మహామదాబాద్ సహకార బ్యాంక్
రైతుల శ్రేయస్సు కోసం పనిచేస్తున్న సిబ్బంది

అభివృద్ధి పథంలో మహమ్మదాబాద్ సహకారబ్యాంక్
రైతుల శ్రేయస్సు కోసం పనిచేస్తున్న సిబ్బంది
అమడగురు యువతరం విలేఖరి;
మండల కేంద్రంలో మహమ్మదాబాద్ సహకార బ్యాంక్ అభివృద్ధి పథంలో నడుస్తుంది. సహకార బ్యాంక్ అధ్యక్షులు ఆంజనేయులు రైతుల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రైతు సమస్యలను పూర్తిగా అవగాహన చేసుకుని వారికి అవసరమైన మేరా వ్యవసాయ పంటలు రుణాలతో పాటు, పాడి పరిశ్రమకు కూడా రుణాలు ఇచ్చి రైతులను ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో మహమ్మదాబాద్ సహకార బ్యాంకు సిబ్బంది పాత్ర ఎంతో అభినందనీయమని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహమ్మదాబాద్ సహకార బ్యాంకులో దాదాపు 700 మంది కి పైగా రైతులు వివిధ రకాల పంట రుణాలు పొంది లబ్ధి చేకూర్చడం జరిగింది. దాదాపు 6.5 కోట్లతో మహమ్మదాబాద్ సహకార బ్యాంక్ లావా దీవులతో నడుస్తుంది. ఈ సందర్భంగా మహమ్మదాబాద్ సహకార బ్యాంక్ అధ్యక్షులు ఆంజనేయులు మాట్లాడుతూ పుట్టపర్తి శాసనసభ్యులు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఆశీస్సులు, ఆదేశాలు, సహకారంతో రైతులకు విరివిగా రుణాల అందిస్తున్నామన్నారు. వ్యవసాయం తర్వాత ఇక్కడ పాడి పరిశ్రమపైనే రైతుల ఆధారపడి ఉంటారని పాడి పరిశ్రమ అభివృద్ధి కొరకు పాడు రైతులకు కూడా రుణాలు అందించి పాడి రైతుల అభివృద్ధికి తగినంత ప్రోత్సాహం అందించమన్నారు భవిష్యత్తులో కూడా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఆశీస్సులతో మహమ్మదాబాద్ సహకార బ్యాంకు ను అన్ని విధాల అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. మహమ్మదాబాద్ బ్యాంక్ అభివృద్ధికి పాటుపడిన సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు.