AGRICULTUREANDHRA PRADESHDEVELOPSTATE NEWS

బనవాసి లో ఫిష్ ఆంధ్ర షాపును ప్రారంభించిన ఇంతియాజ్

బనవాసి లో ఫిష్ ఆంధ్ర షాప్ ను ప్రారంభించిన సెర్ఫ్ ముఖ్య
కార్యనిర్వాహణ అధికారి ఇంతియాజ్

ఎమ్మిగనూరు యువతరం ప్రతినిధి;

మండల పరిధిలోని బనవాసి నందు ఫిష్ ఆంధ్ర షాప్ ను సెర్ఫ్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి ఇంతియాజ్, నియోజకవర్గ సీనియర్ నాయకుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి లు శనివారం ప్రారంభించారు.అనంతరం లబ్ధిదారులకు గొర్రెలు,కోళ్లు, నాటుకోళ్లు ను పంపిణీ చేశారు
ఈ సందర్భంగా ఇంతియాజ్ మాట్లాడుతూ ఏపీలో ఇప్ప‌టికే ఇంటి ముందుకే రేష‌న్ బియ్యం,స‌రుకులను మొబైల్ వాహ‌నాలు ద్వారా అందిస్తున్న ప్ర‌భుత్వం ఇకపై చేప‌లు,  రొయ్య‌ల‌ను కూడా మొబైల్ వాహ‌నాలు ద్వారా ఫిష్
ఆంధ్ర పేరుతో ప్ర‌జ‌ల‌కు
అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ద‌మైందని ఇందుకోసం ఇప్ప‌టికే రాష్ట్ర వ్యాప్తంగా 70 ఫిష్ హ‌బ్‌లు ఏర్పాటుకు ప్ర‌ణాళిక‌లు సిద్దం చేసామని తెలిపారు.ఒక్కో హ‌బ్‌కు మ‌త్య్స ఉత్ప‌త్తుల యూనిట్ల‌తో పాటు 14 వేల రిటైల్ అవుట్ లెట్లు, రిటైల్ వెండింగ్ పుడ్ కోర్టులు, మొబైల్ యూనిట్లు ఉండ‌నున్నాయన్నారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు 56 హ‌బ్‌లు ప్ర‌భుత్వం సిద్ధం చేసిందని వీటికి అనుబందంగా దుకాణాలు కూడా అందుబాటులోకి తెస్తుందని ప్ర‌భుత్వం త‌ల‌పెట్టిన ఫిష్
ఆంధ్ర వ‌ల‌న వినియోగ
దారుల‌తోపాటు రైతుల‌కు లాభం చేకూరుతుంద‌ని ప్ర‌భుత్వం భావిస్తోందన్నారు.అయితే ఇక్క‌డ ఎగుమ‌తుల‌ను నాణ్య‌త పేరుతో లేదా ఇత‌ర త‌నిఖీల పేరుతో అక్క‌డ తిర‌స్క‌రించ‌డంతో రైతులు న‌ష్ట‌పోతున్నారని క‌రోనా కాలంలో వివిధ దేశాల‌కు ఎగుమ‌తులు నిలిచిపోవ‌డం ఎగుమ‌తులు చేసిన‌ వాటికి కూడా ఇబ్బందులు రావ‌డం వంటి అంశాల‌ను దృష్టిలో పెట్టుకున్న ప్ర‌భుత్వం ఫిష్ ఆంధ్ర బ్రాండ్ ఏర్పాటు చేసి ఈ దిశగా ముందుకెళ్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బిఆర్. బసిరెడ్డి , ప్రగతి మండల మహిళా సమఖ్య సభ్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!