పేదలకు వరం జగనన్న సురక్ష కార్యక్రమం

పేదలకు వరం జగనన్న సురక్ష కార్యక్రమం
తుగ్గలి యువతరం విలేఖరి;
రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన జగనన్న సురక్ష కార్యక్రమం పేద ప్రజలకు లాంటిదని వైయస్సార్సీపి నాయకుడు నునసారాళ్ల ప్రతాప్ రెడ్డి, బొందిమడుగుల సచివాలయ కన్వీనర్లు ఈశ్వర్ రెడ్డి, డాక్టర్ రంగారెడ్డి ,ఎంపీటీసీ జల్లా సుంకన్న లు అన్నారు. శనివారం బొందిమడుగుల గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు కొన్ని ధ్రువీకరణ పత్రాలు లేకపోవడం వల్ల అందకపోవడంతో అలాంటి వారి కోసం ఈ పథకాన్ని ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకే జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సావిత్రి ,డిప్యూటీ తాసిల్దార్ నిజాముద్దీన్, పంచాయతీ కార్యదర్శి రామాంజనేయులు, విఆర్ఓ రాజ్ కుమార్ నాయక్, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు .