
సర్పంచులకు బాసటగా ఉంటా…
మంత్రులు దయాకర్ రావు ,సత్యవతి ,ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి దృష్టికి తీసుకొని వెళుతా..
ప్రతి సమస్యను అధిష్టానం దృష్టికి తీసుకొని వెళ్ళి పరిష్కరించి కాపాడుకుంటా…
బిఆర్ఎస్ ప్రభుత్వంలో సర్పంచ్ లకు మహార్థశ
సర్పంచ్ లు అధైర్యపడొద్దు
జడ్పీ చైర్మన్ బడే నాగజ్యోతి
ములుగు,జిల్లా , యువతరం ప్రతినిధి.
ములుగు : ప్రభుత్వం, ప్రజలకు మద్యన అనుసంధాన కర్తలు సర్పంచ్ లు అని ములుగు జడ్పీ చైర్ పర్సన్ బడే నాగజ్యోతి అన్నారు. బుధవారం ఆమె జడ్పీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ములుగు మండలంలోని బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ లతో ప్రత్యేక సమావేశమయ్యారు. వారి సమస్యలను అతి త్వరలో పంచాయితి రాజ్ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు , ఇంచార్జీ మంత్రులు సత్యవతిరాథోడ్,ఎమ్మెల్సీ
పల్లా రాజేశ్వర్ రెడ్డి దృష్టికి తీసువెళ్లి సమస్యలు పరిష్కారమయ్యేలా కృషి చేస్తానని సర్పంచ్ లకు ఆమె హామి ఇచ్చారు.బిఆర్ఎస్ ప్రభుత్వంలో సర్పంచ్ లకు మహార్దశ వచ్చిందని గత ప్రభుత్వాల హయాంలో ఏనాడు కూడా గ్రామాలలో ఇంత అబివృద్ది జరుగలేదని గతంలో ఎప్పుడు కూడా ప్రభుత్వం నుండి ఇన్ని నిధులు వచ్చేవి కాదని, ఈ అబివృద్ది మూలంగా ప్రజలలో సర్పంచ్ లకు మంచిఆదరణ వచ్చిందన్నారు.
సర్పంచ్ లు ఎవ్వరు అధైర్య పడొద్దని వారికి ఏ సమస్య ఉన్న నేరుగా తనను కలువవచ్చునని పరిష్కారం మార్గం చూపే దిశగా తాను ప్రయత్నిస్తానని వారికి భరోసా ఇచ్చారు.
ప్రతి సర్పంచ్ కు బిఆర్ఎస్ పార్టీలో సముచితస్థానం ఉంటుందని బిఆర్ఎస్ పార్టీలో ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు పార్టీ జెండా క్రిందనే పనిచేయాలని గ్రూపు రాజకీయాలు చేస్తే అధిష్టానం చూస్తు ఊరుకోదని అన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ వెంట రైతు బందు జిల్లా అధ్యక్షుడు పల్లా బుచ్చయ్య, సర్పంచ్ ల పోరం మండల అధ్యక్ష కార్యదర్శులు భూక్య పవన్ నాయక్, దాసరి రమేష్ , ఇంచర్ల సర్పంచ్ మోరె రాజయ్య, బరిగలోని సర్పంచ్ గరిగే లత నర్సంగ రావు, మదనపల్లి సర్పంచ్ రాం నాయక్, రాంచంద్రాపూర్ సర్పంచ్ హట్కారి కల్పన రూప్ సింగ్, గూర్తుర్ తండా సర్పంచ్ తిరుపతి, కొత్తూరు సర్పంచ్ పారిజాతం వెంకటస్వామి, కొడిశెల కుంట సర్పంచ్ బానోతు మంజుల యాక్ నాయక్ , పంచోత్కులపల్లి సర్పంచ్ మాలోతు రవిందర్ తదితరులు పాల్గొన్నారు.