ANDHRA PRADESHDEVOTIONALSTATE NEWS
శ్రీశైలంలో అమ్మవారికి సారెను సమర్పించిన ఉపముఖ్యమంత్రి

అమ్మవారికి సారె ను సమర్పించిన ఉపముఖ్యమంత్రి
శ్రీశైలం యువతరం ప్రతినిధి;
ఆషాఢమాసం సందర్బంగా శ్రీశైలంలో అమ్మవారికి సారెను ( వస్త్రాలను) రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మరియు దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ గురువారం సమర్పించారు.
ఈ కార్యక్రమములో శ్రీశైల నియోజకవర్గం శాసనసభ్యులు శిల్పాచక్రపాణిరెడ్డి, దేవదాయశాఖ కమీషనర్ ఎస్. సత్యనారాయణ, ధర్మకర్తలమండలి అధ్యక్షులు శ్రీరెడ్డివారి చక్రపాణిరెడ్డి, కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న, మరియు ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.