వేదవతి ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తి చేస్తారు
ఆలూరు సీనియర్ కాంగ్రెస్ నేత చిప్పగిరి లక్ష్మి నారాయణ

వేదవతి ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తి చేస్తారు
నిర్మాణం పూర్తయితే ఆలూరు నియోజకవర్గం సాగు, త్రాగు నీటీతో సస్యశ్యామలం
రాష్ట్ర మంత్రి, స్థానిక ఎమ్మెల్యే జయరాం పనులు ఎందుకు నిలిపివేశారో దృష్టి సారించండి
వేదవతి ప్రాజెక్టు నిర్మాణం పనులు పరిశీలించిన
ఆలూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర సహాయ కార్యదర్శి చిప్పగిరి లక్ష్మీనారాయణ..
ఆలూరు యువతరం విలేఖరి;
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అభివృద్ధిలో వెనుకబడిన నియెాజకవర్గలలో ఒకటి ఆలూరు నియోజకవర్గం ఇక్కడి రైతులను, ప్రజలను దృష్టిలో పెట్టుకుని గత టిడిపి ప్రభుత్వం వేదవతి ప్రాజెక్టు తీసుకువచ్చి నియెాజకవర్గంలోని సాగు, త్రాగనీటి సమస్యను పరిష్కరించేందుకు దాదాపు 1942.38 కోట్ల రూపాయలు మంజూరు చేసింది.
వైసిపీ అధికారంలోకి నిర్మాణం కోసం శంకుస్థాపన చేసి నిధులను 1600 కోట్లకు కుదించి హైదరాబాద్ కు చెందిన మెగా ఇన్ ఫ్రాస్ర్టక్షర్ కంపెనీకీ అప్పగించింది.
పనులు మెదలు పెట్టిన సంస్థ మొదటి దశగా 90 కోట్ల రూపాయలతో పైపులైను పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం పైస పైసా కూడా బిల్లులు చెల్లించకపోవడంతో నిర్మాణం పనులు నిలిచిపోయాయని అన్నారు.
వేదవతి పూర్తయితే ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం, కోడుమూరు నియోజకవర్గాలకు దాదాపు 196 గ్రామలలో 80 వేల ఎకరాలకు సాగు త్రాగు నీరు అందిచవచ్చని పనులు నిలిచిపోయిన రాష్ట్ర మంత్రి, నియెాజకవర్గ ఎమ్మెల్యే జయరాం పట్టించుకోకుండా రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలిపారు.
తక్షణమే మంత్రి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వేదవతి నిర్మాణం పూర్తి చేసేందుకు నిధులు విడుదల చేయించాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీనీ ఆదరించాలని ప్రాజెక్టులు నిర్మించాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని రైతులకు సాగునీరు, త్రాగునీరు అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ చిప్పగిరి మండల అధ్యక్షులు డేగులపాడు మంజునాథ్, హోలగుంద వెంకటేష్, గూల్యం విజయ్ కుమార్, కరెంటు గోవిందు, చిప్పగిరి వినోద్ కుమార్, కత్తి రామాంజనేయులు, యల్లప్ప హలహర్వి, హోలగుంద మండలాల రైతులు పాల్గొన్నారు.