వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల క్లస్టర్ విధానాన్ని రద్దు చేయాలి
ఎంపీడీవోకు వినతిపత్రం

వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల క్లస్టర్ విధానాన్ని ఎత్తివేయాలి
ఎంపీడీవో కు వినతి పత్రం ఇచ్చిన ఎన్ ఎస్ యు ఐ
ఎమ్మిగనూరు యువతరం ప్రతినిధి;
పశుసంవర్ధక శాఖలో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని, క్లస్టర్ విధాన అమలును రద్దు చేయాలి అని
ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు వీరేష్ యాదవ్ ఈ సందర్భంగా ఎంపీడీవో బంగారమ్మకు బుధవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న రైతు భరోసా కేంద్రాలలో,సచివాలయ పరిధిలోని ఖాళీగా ఉన్న యానిమల్ హస్బండరీ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయుటకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చినప్పటికీ అధికారులు కొత్తగా క్లస్టర్ విధానాన్ని పెట్టడం జరిగిందన్నారు. 3 నుంచి 5 రైతు భరోసా కేంద్రాలను ఒక క్లస్టర్ గా ఏర్పాటు చేసి ప్రతి తదనగుణంగా రైతు భరోసా కేంద్రాలలో పోస్టులు మిగులుగా చూపించి ప్రయత్నం చేస్తున్నారన్నారు. కావున దీనివలన రాష్ట్రంలో గత మూడు సంవత్సరాల నుండి డైరీ ఒకేషనల్ మరియు డిప్లమా చదివిన అభ్యర్థులు సుమారు 30 వేలకు మందిపైగా నష్టపోతున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు సోమిరెడ్డి రంగస్వామి, హరి, వీరేష్, శివరాం, భాస్కర్ , పాల్గొన్నారు.