భీమ్ ఆర్మీ చీఫ్ పై కాల్పుల దాడి పిరికి పందల చర్య

భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ పై కాల్పుల దాడి పిరికిపందల చర్య
చంద్రశేఖర్ ఆజాది రావణ్ దాడి ని తీవ్రంగా ఖండించిన మాలమహానాడు రాయలసీమ అధ్యక్షులు సి. రంగయ్య
దోషులను పట్టుకోవడం లో నిర్లక్ష్యం వహిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని కేంద్ర ప్రభుత్వం కి హెచ్చరిక
ఎమ్మిగనూరు యువతరం ప్రతినిధి;
జిల్లా నాయకులు మల్లేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన పత్రిక సమావేశం లో ఉత్తరప్రదేశ్ లోని భీమ్ ఆర్మీ చీఫ్ పై దుండగులు కాల్పులు జరపడం యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతి కి గురిచేసిందని మాలమహానాడు రాయలసీమ అధ్యక్షులు సి. రంగయ్య ప్రకటనలో తెలిపారు.మతోన్మాదం బుసలు కొడుతున్న ఉత్తరప్రదేశ్ లో రాజ్యాంగ హక్కులను పరిరక్షించడానికి, కుల అణచివేతను వ్యతిరేకించడానికి 2015లో భీమ్ ఆర్మీని స్థాపించారు.ఈ సంస్థ కు నాయకుడైన చంద్రశేఖర్ ఆజాద్ అనతికాలంలోనే దళితులను, బహుజనులను సంఘటిత పరిచి ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రత్యర్థిగా మారాడని అధికార బీజేపీ తప్పుడు కేసులు బనాయించీ జైల్లో నిర్బంధినప్పటికీ వెన్నుచూపని ధైర్యం అతనిదని ఆజాద్ పై జరిపిన కాల్పుల వెనుక అధికార పార్టీ ల హస్తం తప్పకుండ ఉంటుందని చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ ని చంపితే వేలమంది చంద్రశేఖర్ ఆజాద్ లు పుట్టుకొస్తారని హెచ్చరించారు. జిల్లా నాయకులు మల్లేష్ మాట్లాడుతూ ఈ దాడిని బట్టి దళితుల మీద దళిత నాయకుల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు కుట్రలు బట్టబయలు అయ్యాయి అని తెలిపారు.ఈ దాడి మీద అన్ని రాజకీయ ప్రతిపక్ష పార్టీ లు ప్రజా సంఘాలు కుల,విద్యార్థి సంఘాలు వామపక్షాలు అందరు కలిసి త్వరలో నిర్ణయం తీసుకుని భారత్ బంద్ పిలుపు ఇచ్చే దిశగా అడుగులు వేసి న్యాయం జరిగే వరకు అన్ని రాష్ట్రాలలో పోరాటం ఆగదని తెలిపారు. చంద్రశేఖర్ ఆజాది కి జరగరానిది ఏమైనా జరిగితే మాత్రం ఆపై జరిగే పరిణామాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం లు భాద్యత వహించాలని హెచ్చరించారు. వచ్చే ఎన్నికలలో మీ అంతు చూడటానికి ప్రతీ రాష్ట్రంలో దళితులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.దోషులని పట్టుకోవడంలో న్యాయం చేయడం లో నిర్లక్ష్యం వహిస్తే మాత్రం దేశం లో ధర్నాలు రాస్తారోకోలతో అట్టడుకుతుందని దేశంలో ప్రతీ రాష్ట్రం లో లక్షల మంది చంద్రశేఖర్ ఆజాది రావణ్ లు ఉన్నారని అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిలో పెట్టుకోవాలని తెలిపారు. ఈ దాడిపై తరువాత కార్యాచరణ కు పై చర్చకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకుల నుండి ఆహ్వానం అందిందని కార్యాచరణ మేరకే ముందుకు వెళతాం అని మాలమహానాడు రాయలసీమ అధ్యక్షులు సి. రంగయ్య గారు తెలిపారు.కార్యక్రమం లో వివిధ గ్రామాల మాలలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.