ANDHRA PRADESHOFFICIALSTATE NEWS

బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన ఎస్సై

బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన ఎస్సై

పెద్దవడుగూరు యువతరం విలేఖరి;

మండల ప్రజలకు, ముస్లిం సోదర సోదరీమణులకు బక్రీద్‌ పర్వదినం సందర్భంగా పెద్దవడుగూరు ఎస్సై డి శ్రీనివాసులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ ఐ డి శ్రీనివాసులు బుధవారం మాట్లాడుతూ త్యాగం, సహనం బక్రీద్‌ పండుగ ఇచ్చే సందేశాలన్నారు. దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ ఈ పండుగ జరుపుకుంటారన్నారు. భక్తి భావం, విశ్వాసం, కరుణ, ఐక్యతకు సంకేతమైన ఈ పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకోవాలని సూచించారు. ఈ పండుగ సోదర భావం, ఐక్యతకు ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని అభిలషించారు. అల్లా దయతో పెద్దవడుగూరు మండల ప్రజలు సుబిక్షంగా ఉండాలని ప్రార్థిస్తున్నానని అన్నారు.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!