బక్రీద్ పండుగకు ఆవులను వధిస్తే కఠిన చర్యలు
మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి

బక్రీద్ పండుగకు ఆవులను వధిస్తే కఠిన చర్యలు
మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి
ఎమ్మిగనూరు యువతరం ప్రతినిధి;
ఈనెల 29వ తేదీన జరగనున్న బక్రీద్ పండగ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా గోవులను లేదా ఆవులను వధించడం చట్టరీత్యా నేరమని ఈ విషయాన్ని గుర్తుంచుకొని మసులుకోవాలని మున్సిపల్ కమిషనర్ ఎన్.గంగిరెడ్డి హెచ్చరించారు. మంగళవారం ఆయన పత్రికలో విడుదల చేసిన ప్రకటనలో విషయం పేర్కొంటూ బక్రీద్ పండగ సందర్భంగా ముస్లిం సోదరులు పశువులను వధించడం ఆనవాయితీగా వస్తూ ఉందని ,అయితే బహిరంగ ప్రదేశాలలో ఎక్కడపడితే అక్కడ అంటే ఇళ్ల వద్ద రోడ్లపై ఎక్కడపడితే అక్కడ పశువులను వధించరాదని తెలిపారు.నిబంధనలకు విరుద్ధంగా ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా చేస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించిన చట్ట ప్రకారం గోవులను, దూడను వధించరాదని ఈ విషయాన్ని గుర్తుంచుకొని తమ బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకోవాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే అలాంటి వారిపై మున్సిపల్ యాక్ట్ చట్టంలో ఉన్న ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన తీవ్రంగా హెచ్చరించారు.