
రైతులకు తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలి
వెల్దుర్తి యువతరం విలేఖరి;
మండలములోని నర్సరీ
యజమానులకు బుధవారం వ్యవసాయ కార్యాలయంలో సమావేశము మండల వ్యవసాయ అధికారి అక్బర్ బాషా, ఉద్యాన అధికారి విజయలక్ష్మి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నర్సరీ లో నిర్వహించవలసిన
అన్ని రకాల రికార్డులను
తప్పనిసరిగా నిర్వహించాలని
ఆదేశించడం జరిగింది.నర్సరీ నుండి మొక్కలు
తీసుకొన్న ప్రతి రైతుకు
తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలి అన్నారు.
నర్సరీ చట్టము 30 (2010)
ప్రకారము ప్రతి నర్సరీ
యజమాని తప్పనిసరిగా
లైసెన్స్ కలిగి ఉండాలి అని తెలిపారు.
నర్సరీ యజమానులు
విత్తనములు కొనేటప్పుడు
తప్పనిసరిగా బిల్లులు తీసుకొని
వాటిని రిజిస్టర్ నందు నమోదు
చేసుకోవాలి అన్నారు.
తనిఖీ అధికారులు
వచ్చినప్పుడు రిజిస్టర్లు
చూపించి సహకరించాలని
ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో
రామళ్లకోట గ్రామ ఉద్యాన సహాయకులు సాంబశివుడు తదితరులు పాల్గొన్నారు.