గోడిలో చిత్రకళ ఉపాధ్యాయుడు రాజ్ కుమార్ కు ప్రముఖుల సన్మానం

గోడి లో చిత్రకళ ఉపాధ్యాయుడు రాజకుమార్ కు ప్రముఖుల సన్మానం
అమలాపురం యువతరం ప్రతినిధి;
ఇటీవల డ్రీమ్స్ యంగ్ అండ్ చిల్డ్రన్ ఆర్ట్ అకాడమీ ఫైన్ ఆర్ట్స్ ఫౌండేషన్ విజయవాడలో నిర్వహించిన చిత్రకళ పోటీలలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం గోడి బాలురు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల విద్యార్థులు నాలుగు స్వర్ణ పథకాలు మూడు వెండి పతాకాలు సాధించారు.విద్యార్థులను ఉత్తమ చిత్రకారులుగా తీర్చిదిద్దిన ఆర్ట్స్ టీచర్ ఊర్రం రాజకుమార్ ని” ఉత్తమ చిత్రాకళ ఉపాధ్యాయుడు” అవార్డుతో డ్రీమ్స్ సంస్థ వారు మెమెంటో,గజమాలతో సత్కరించారు.ఈ సందర్భంగా గురువారం ఉదయం అమలాపురానికి చెందిన ప్రముఖ వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు వంటెద్దు వెంకన్న నాయుడు, జనుపల్లి కి చెందిన ప్రముఖ సమాజ సేవకురాలు, అమలాపురం కి చెందిన సాయి సంజీవిని వాకర్స్ యోగ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జల్లి సుజాత, ఆర్ట్ టీచర్ ఊరం రాజ కుమార్ ని సన్మానించారు. ఈ సందర్భంగా వంటెద్దు వెంకన్నాయుడు
మాట్లాడుతూ విద్యార్థులలో నిగూఢంగా దాగిన సృజనాత్మక శక్తిని బయటకు తీసి దానిని సమాజ పరం
చేయడానికి వారిని తీర్చి దిద్దడం ఉపాధ్యాయుడు కర్తవ్యం అని అటువంటి ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో దాగిన చిత్రకళ నైపుణ్యాన్ని బయటికి తీసి వారిని ఉత్తమంగా తీర్చిదిద్దినందుకు ఉపాధ్యాయుడు రాజ కుమార్ కు అభినందనలు తెలిపారు. లలిత కళల్లో కవిత్వం తర్వాత అతి ముఖ్యమైనది చిత్రకళ అని
అటువంటి కశలో విద్యార్థులను తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయుడిని ఆయన హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. శ్రీమతి జల్లి సుజాత మాట్లాడుతూ ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో దాగి ఉన్న కళలను వెలికి తీయడానికి ప్రయత్నం చేయాలని ఆమె కోరారు..ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ నేతల శ్యాం ప్రసాద్, వైస్ ప్రిన్సిపల్ ఎండి. ఇబ్రహీం జానీ ఇతర ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొని ఆర్ట్ టీచర్ రాజ్ కుమార్ ని విద్యార్థులను అభినందించారు.