
భారీగా కర్ణాటక మద్యం స్వాధీనం
ఆమడగూరు పోలీసులను అభినందించినపోలీసు ఉన్నతాధికారులు
అమడుగురు యువతరం విలేకరి;
మండల పరిధిలోని,కర్ణాటక నుంచి అక్రమంగా కర్ణాటక మధ్యాన్ని ఆంద్రాకు తరలిస్తున్న మద్యం ముఠాను అమడగూరు ఎస్ఐ వెంకట్ నారాయణ, సిబ్బందితో కలిసి ఎంతో చాకచక్యంగా మద్యం ముఠాను పట్టుకున్నారు. ఎస్సై వెంకట్ నారాయణ తెలిపిన వివరాలు మేరకు జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఉత్తర్వులు మేరకు, డి.ఎస్.పి, సి ఐ ఆదేశాల మేరకు కర్ణాటక మద్యాన్ని అక్రమంగా ఆంధ్రాకు తరలిస్తున్న ముఠా సభ్యుడైన సురేంద్ర( అలియాస్ బెల్లం సూరి ) మండలంలోని మహమ్మదాబాద్ సమీపంలోని గొల్లపల్లి గ్రామం వద్ద కర్ణాటక మద్యం ఐ వాట్స్( 763 )90 ఎం, ఎల్ పెట్రా ప్యాకెట్లను ద్విచక్ర వాహనంలో అక్రమ తరలిస్తుండగా తమ సిబ్బందితో కలిసి కర్ణాటక మధ్యాన్ని, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ వెంకటనారాయణ తెలిపారు. రిమాండ్ నిమిత్తం కదిరి కోర్టుకు హాజరు పరిచినట్లు ఎస్ఐ తెలిపారు. కర్ణాటక మధ్యాన్ని ఎంతో చాకచక్యంగా పట్టుకున్న ఎస్ఐ వెంకటనారాయణ ను, సిబ్బందిని పోలీసు ఉన్న అధికారులు అభినందించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ సుధాకర్, జగదీష్ బాబు, సిబ్బంది భాస్కర్, చంద్రహాస్, రత్నాకర్, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.