ANDHRA PRADESHSTATE NEWSTOURISM
ఏపీ టూరిజం రెస్టారెంట్ పనులు ప్రారంభించిన వైస్ ఎంపీపీ

ఏపీ టూరిజం రెస్టారెంట్ పనులు ప్రారంభించిన మండల వైస్ ఎంపిపి
కొత్తపల్లి యువతరం విలేఖరి;
కొత్తపల్లి మండలంలోని ప్రముఖ క్షేత్రమైన సంగమేశ్వరం ఎపి టూరిజం రెస్టారెంట్ లీజ్ టెండర్ ను దక్కించుకున్న కొత్తపల్లి వైస్ ఎంపిపి సింగారం వెంకటర మణ(రంగా) బుధవారం టూరిజం రెస్టా రెంట్ మరమ్మత్తు పనులు ప్రారంభించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ పర్యాటకులకు ఏ ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. పర్యాటకులు ఓ వైపు కృష్ణాజలాలు మరోవైపు నల్లమల్ల అందాలు ఆస్వాదించే విధంగా సుందరంగా టూరిజం రెస్టారెంట్ ని అభివృద్ధి చేస్తామన్నారు. త్వరలోనే రెస్టారెంట్ ప్రారంభించి పర్యాటకులకు అందుబాటులోకి తేస్తామన్నారు.