ఎరుకల సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఏకలవ్య జయంతి

ఎరుకల సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఏకలవ్య జయంతి
ఎమ్మిగనూరు యువతరం ప్రతినిధి;
ఎమ్మిగనూరు పట్టణంలో ఆంధ్రప్రదేశ్ ఎరుకల సేవా సంఘం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ వై.పి.శివసూర్యనారాయణ అధ్వర్యంలో సంఘ సభ్యులు పాల్గొని గురువారం ఏకలవ్య జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎరుకల జాతి మూలపురుషుడు ఏకలవ్యుడు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జాయింట్ సెక్రటరీ వై.పి.శివసూర్యనారాయణమాట్లాడుతూ ఏకలవ్యుడు అంటేనే ఎదురులేని బాణం అని,గురుభక్తికి యెనలేని కీర్తికిరీటంఅన్నారు.వన్యప్రాణులను తన ప్రాణాల కన్న ఎక్కువగా ప్రేమించి వాటిని కంటికి రెప్పలా కాపాడే కాపరిగా ఉంటూ,శబ్ధవేది విద్యలో తనను మించిన వీరుడు భూమి మీద ఎవరు లేరని చరిత్రలో తనను ఢీకోగల దీరులు లేరని ప్రసిద్ధి అన్నారు.విద్యనేర్పని గురువు ప్రతిమను మట్టితో విగ్రహం ప్రతిష్ఠించి నువ్వే నా గురువని విలువిద్యను సాదనచేసి గురువు కానీ గురువు గురుదక్షిణగా బోటన వేలు అడీగితే ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే తనచేతిబోటనవేలు కోసిచ్చి గురు భక్తిని చాటిచెప్పాడని కొనియాడారు.భారతదేశంలో స్వయంగా హర్యయణ రాష్ట్రం గోరగౌలో ఏకలవ్యుడు వెలిచినాడు ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి నాడు పూజలు నిర్వహిస్తారు అక్కడ పిల్లులకు అక్షరాస్యం చేస్తే ఎంతో ఉన్నతమైన స్థాయికి పిల్లలు ఎదుగుతారు అని అక్కడి వారి నమ్మకం అని,మా ఆదివాసి గిరిజన ప్రజలు మాత్రమే కాకుండా ఆ ప్రాంతంలో నివసించే ప్రతి ఒక్కరూ ఏకలవ్యుడిని పూజిస్తారు ద్యానిస్తారన్నారు.ఈ కార్యక్రమంలో
ఎరుకల రాముడు, ఎరుకల ప్రసాద్, ఎరుకల చంద్ర, ఎరుకల కుమార్, ఎరుకల జగదీష్, ఎరుకల గౌరీ శంకర్ తదితరులు పాల్గొన్నారు.