
ఎమ్మిగనూరు పట్టణంలోని వార్డుల అభివృద్దే లక్ష్యం
ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి
ఎమ్మిగనూరు యువతరం ప్రతినిధి;
ఎమ్మిగనూరు పట్టణంలోని అన్ని వార్డుల అభివృద్ధి చేయడం ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి లక్ష్యం అని, ఇందులో భాగంగానే 16 వార్డు కురువ ఫంక్షన్ హాల్ ఎదురుగా కొన్ని ఏళ్ల నుండి ప్రజలు ఇబ్బంది దృష్ట్యా వారి సమస్యకు పరిష్కారం కొరకు కల్వర్టు, సిసి రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు నియోజకవర్గ సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలో కోటి రూపాయల వ్యయంతో ఆయ వార్డులో 16వ వార్డులో కల్వర్ట్, 14వ వార్డు నందు పైప్ లైన్, 5వ, 6వ వార్డు లో పైప్ లైన్, 6వ వార్డు లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కింద మంజూరైన సిసి రోడ్డు నిర్మాణానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గ సీనియర్ నాయకుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి హాజరై భూమిపూజ
చేశారు.ఈ కార్యక్రమంలో వార్డుల కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, చైర్మన్ లు, వైస్ చైర్మన్ లు, కౌన్సిలర్లు, ఇన్ ఛార్జ్ లు, మున్సిపల్ అధికారులు, కార్యకర్తలు, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.