ఎమ్మిగనూరులో భక్తిశ్రద్ధలతో బక్రీద్ వేడుకలు

ఎమ్మిగనూరు లో భక్తిశ్రద్ధలతో బక్రీద్ వేడుకలు
ఎమ్మిగనూరు యువతరం ప్రతినిధి;
త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ వేడుకలను ఎమ్మిగనూరు పట్టణంలో ముస్లిం సోదరులు గురువారం ఘనంగా జరుపుకున్నారు. ప్రత్యేక ప్రార్థనలు చేసి, పరస్పరం పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పండుగ సందర్భంగా ముస్లిములకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతూ ప్రకటనలు విడుదల చేశారు. పర్వదినం సందర్భంగా మసీదులు, ఈద్గాలను అందంగా అలంకరించారు. ఈద్గాల్లో సామూహిక ప్రార్థనలు చేశారు.ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో వేడుకలను నిర్వహిస్తున్నారు. ప్రవక్త హజరత్ ఇబ్రహీం త్యాగం ఆదర్శనీయమని పేర్కొన్నారు. ఇస్లాం సూచించిన సన్మార్గంలో నడిచి పేదలకు దానఽ, ధర్మాలు చేయాలని, పేదరికం లేని సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలన్నారుమసీద్‌ల వద్ద టౌన్ సిఐ మధుసూదన్ రావు ఆధ్వర్యంలో పోలీస్‌శాఖ బందోబస్తు నిర్వహించారు. పోలీసులు కూడా ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు.