ANDHRA PRADESHDEVELOPPOLITICS
25వ వార్డులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కేకే రాజు

25వార్డులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కె.కె రాజు
విశాఖ యువతరం ప్రతినిధి;
విశాఖ ఉత్తర నియోజకవర్గం 25వార్డు 1086134 సచివాలయం పరిధి సీతంపేట జి వి కే ప్లాజా ఎదురుగా, పిండి మిల్లు వీధిలో గడప గడపకు మన ప్రభుత్వం నిధులు 20లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్లు,డ్రైన్లు నిర్మాణం పనులకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం స్టాండింగ్ కమిటీ మెంబర్,25వార్డు కార్పొరేటర్ సారిపిల్లి గోవింద్ ఆధ్వర్యంలో జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర నెడ్ క్యాప్ చైర్మన్ కె.కె రాజు పాల్గొని కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో ఏ ఇ శ్రీరాంమూర్తి,బోగవల్లి గోవింద్,హరికృష్ణ,సమ్మెట్ల వెంకటేష్,లక్ష్మణ్ కుమార్,కె.చిన్నా,జయ,అశోక్,సన్నీ,ప్రసాద్,కోలని పెద్దలు,మహిళలు,సచివాలయం సిబ్బంది,వాలంటరీలు తదితరులు పాల్గొన్నారు.