మత్తుకు బానిస కావొద్దు యువత జాగ్రత్త
జూనియర్ సివిల్ జడ్జి కె. గురు అరవింద్

మత్తుకి బానిస కావొద్దు యువత జాగ్రత్త…
జూనియర్ సివిల్ జడ్జి
కె. గురు అరవింద్
ఎమ్మిగనూరు యువతరం ప్రతినిధి;
మాదక ద్రవ్య నివారణ దినోత్సవం సందర్భంగా సెన్ జాన్స్ ఇంజినీరింగ్ కాలేజ్ లో జూనియర్ సివిల్ జడ్జి కే గురు అరవింద్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పిల్లలు భవిష్యత్తు పాడు అవ్వటానికి డ్రగ్స్ ఎక్కువ కారణం అవుతున్నాయి అని అన్నారు. బార్ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరెడ్డి కుమార్ మాట్లాడుతూ చట్టాలను గురించి వివరించారు.అలాగే
రూరల్ సిఐ మోహన్ రెడ్డి సభను ఉద్దేశించి డ్రగ్స్ కేసులో అరెస్టు అయితే బెయిల్ కూడా రాదు జాగ్రత్త గా ఉండమని తెలుపుతూ చిన్న చిన్న విషయాలకే జీవితం నాశనం చేసుకోవద్దు అన్నారు. అందరూ సొసైటీ కి మేలు చేసే విధంగా ఉండాలని,మొదట మనల్ని మనం రక్షించుకుంటు సొసైటీ ని కాపాడాలి అని రఘురామ న్యాయవాది అన్నారు. ఈ కార్యక్రమంలో రంగనాథ్, మురళీకృష్ణ, రామ మూర్తి, కళాశాల ప్రిన్సిపాల్ గారు పాల్గొన్నారు.