ANDHRA PRADESHBREAKING NEWSHEALTH NEWS
బస్టాండ్ ప్రాంతంలో పేరుకుపోయిన చెత్త
పట్టించుకోని పంచాయతీ అధికారులు

బస్టాండ్ ప్రాంతంలో పేరుకుపోయిన చెత్త
పట్టించుకోని గ్రామపంచాయతీ అధికారులు
అమడగూరు,యువతరం విలేఖరి;
మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన చెత్త కొద్ది రోజుల నుండి వర్షాలు పడటంతో బస్సులలో వాహనాలలో వచ్చిపోయే ప్రయాణికులు కూర్చోవాలంటే దుర్వాసన ఎక్కువ రావడం వల్ల చాలా ఇబ్బందిగా ఉందని ప్రయాణికులు వాపోయారు. బస్టాండ్ ప్రాంతంలో టీ స్టాల్ హోటల్ జరుపుకునే వాళ్లు బస్టాండ్ ప్రాంతంలోనే వేయడం వల్ల అక్కడి వేసిన చెత్త పేరుకుపోయి ప్రజలకు ఇబ్బందిగా మారింది. అధికారుల మాత్రం చూసి చూడనట్లు పోతున్నారుఇకనైనా పంచాయతీ అధికారులు స్పందించి బస్టాండ్ ప్రాంతంలో చెత్త కుప్పలు పడకుండా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు ప్రజలు తెలియజేశారు.