ANDHRA PRADESHEDUCATION

ప్రైవేట్ కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు

ఎంఈఓ2 రమేష్

ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు

వెల్దుర్తి యువతరం విలేఖరి;

ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో నేడు ఉన్నాయని మండల ఎంఈఓ 2 రమేష్ తెలిపారు. మండల కేంద్రమైన వెల్దుర్తిలోని హరిజనవాడలోని ఎంపీపీ ఎస్ స్కూల్లో తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎంఈఓ 2 మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల చదువుల కోసం చాలా ఖర్చు చేస్తున్నారన్నారు. నాడు నేడుతో విద్యా వ్యవస్థను సమూలంగా మార్పు చేశారని ఈ సందర్భంగా తెలిపారు. కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాల వైపు చూడకుండా తమ చిన్నారులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. నేడు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కావలసిన అన్ని వసతులు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్ సరస్వతి, ఉపాధ్యాయుడు మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!