
ప్రభుత్వాలు రైతాంగ వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలి:ఎ ఐ కె ఎస్
కొత్తపల్లి యువతరం విలేఖరి;
వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించే ప్రక్రియను ఉపసంహరించుకోవాలని ఏపీ రైతు సంఘం మండల అధ్యక్షులు మాబాషా, కార్యదర్శి వీరన్న, దాస్ లు అన్నారు. సోమవారం రైతాంగ సమస్యల పరిష్కారానికి ఈ నెల 30న విజయవాడలో జరిగే మహా ధర్నా జయప్రదానికై ప్రచారజాతా ను మండలం లో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలపై పార్లమెంటులో చట్టం చేయాలని డిమాండ్ చేశారు.అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం, వాణిజ్య పంటలకు రూ.25వేలు ఇవ్వాలని, హైవే రోడ్డు 167 నంద్యాల, కల్వకుర్తి రోడ్డులో భూములు కోల్పోయిన రైతులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారము నష్టపరిహారం ఇవ్వాలన్నారు. కౌలు రైతులకు కౌలు కార్డులు ఇవ్వాలని, ఈ క్రాఫ్ కౌలుదారు పేరుతోనే చేయాలని పాడి రైతులకు ఒక లీటరుకు రూ.4 ఇవ్వాలని నకిలీ విత్తనాలు చలామణిలో రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. దేవాలయ భూములు వంశపార్య పరంగా సాగు చేసుకుంటున్నా రైతులకు హక్కులు కల్పించాలన్నారు. పేద సాగుదారులకు భూహక్కు కల్పించాలన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించే ప్రక్రియను ఉపసంహరించుకోవాలన్నారు. కావున ఈనెల 30న విజయవాడ నగరంలో జరిగే మహాధర్నాలో మండలంలోని రైతులు, కౌలు రైతులు ప్రజలు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని రైతు సమస్యల పరిష్కారానికి రైతు సంఘం నిర్వహిస్తున్నటువంటి పోరాటానికి మద్దతు తెలుపవలసిందిగా వారు కోరారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు గోపాల్ తదితరులు పాల్గొన్నారు.