BREAKING NEWSEDUCATIONTELANGANA
చదువుకు పేదరికం అడ్డుకాకూడదు
పేద విద్యార్థిని హాస్టల్లో చేర్పించిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా

చదువుకు పేదరికం అడ్డుకాకుడదు
పేద విద్యార్థిని హాస్టల్ లో చేర్పించి సబ్ రిజిస్ట్రార్ తస్లీమా .
ములుగు,జిల్లా యువతరం ప్రతినిధి.
- ములుగు జిల్లా చదువుకు పేదరికం అడ్డుకాకూడదని, చదువే అన్నిటికీ మార్గం చూపిస్తుందని ములుగు, భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ అన్నారు,ములుగు జిల్లా కేంద్రానికి చెందిన నేత నవ్య అనే విద్యార్థిని హాస్టల్ లో తస్లీమా చేర్పించారు.సోమవారం ములుగు మండలం మాధవరావుపల్లి కస్తూర్బా హాస్టల్ ప్రిన్సిపాల్ తో తస్లీమా మాట్లాడి అడ్మిషన్ ఇప్పించారు.చదువుకు ఎలాంటి భేదాలు ఉండవని, చదువే ప్రతి సమస్యకూ పరిష్కారం చూపుతుందని తస్లీమా అన్నారు.చదువుతోనే పేదరికం దూరమవుతుందని అన్నారు.
విద్యార్థినికి స్కూల్ బ్యాగు,దుస్తులను తస్లీమా అందించారు.