ANDHRA PRADESHPOLITICS

క్రైస్తవులకు చేసింది ఏమీ లేదు

తెలుగుదేశం

క్రైస్తవులకు చేసింది ఏమీ లేదు

విశాఖ యువతరం ప్రతినిధి;

సిఎం క్రైస్తవులకు చేసిందెమీ లేదని విశాఖ పార్లమెంట్ క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షులు ఉరుకూటి డేవిడ్ అన్నారు సోమవారం ఉదయం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఉరుకూటి డేవిడ్ మాట్లాడుతూ క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ జాన్ వెస్లీ మాట్లాడిన మాటలకి యావత్ క్రైస్తవ సమాజం తలదించుకునే టట్లుగా నిస్సిగ్గుగా మాట్లాడారు అని అన్నారు క్రైస్తవుడని చెప్పుకొనే జగన్ రెడ్డి క్రైస్తవులకు చేస్తున్న మోసం ఇప్పటికే క్రైస్తవులు సిగ్గుతో తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చారని ముఖ్యమంత్రి నాలుగేళ్లలో క్రైస్తవులకి చేసింది ఏమీ లేకపోగా చర్చి పాస్టర్లను హింసించిన చర్చిలను ధ్వంసం చేస్తున్న క్రిస్టియన్ మినిస్ట్రీస్ భూములనుదోచుకున్నా నిమ్మకు నీరు ఎత్తినట్టుగా ఉన్నారని అన్నారు క్రైస్తవులను నమ్మించి రాష్ట్రంలో ఉన్న ఉద్యోగస్తుల్లో ఎస్టీ, ఎస్సి , బీసీ మరియు ఓసి లలో ఉన్న క్రైస్తవ కుటుంబాలను దుఃఖ సముద్రంలో ముంచేసారు అని అన్నారు రాజకీయ స్వలాభం కొరకే అలంకార ప్రాయమైనటువంటి పదవులు ఇచ్చారు తప్ప వాటి వల్ల ఏ మాత్రం క్రైస్తవ సమాజానికి న్యాయం జరగలేదు అని అన్నారు క్రైస్తవత్వం ఒక మతం కాదని ఒక మార్గం అని గుర్తెరిగి మతం మార్చడం కాదు వారి కుటుంబ స్థితి గతులు మార్చాలని చంద్ర బాబు గారు అనేక పర్యాయములు చెబుతూ వచ్చారు. అయితే వీటిని వంకర బుద్దితో, ఆలోచించినా వైసిపి నాయకులు తప్పుడు ప్రకటనలు చేస్తున్నారు అని చెప్పారు అయితే ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వంలో క్రిస్టియన్ మైనారిటీ పిల్లలకు విదేశాల్లో చదువుకోవడానికి విదేశీ విద్య కింద ఒక్కొక్కరికి 10 లక్షలు ఇచ్చి ఉన్నతమైన స్థానం కల్పించాలని ఉద్దేశంతో 68 మందికి ఇచ్చిన ఘనత చంద్రబాబుకె దక్కుతుందని అన్నారు వీటితో పాటు ప్రతి క్రైస్తవ విద్యార్థుకి శిక్షణ కి వెళ్ళుటకు తెలుగుదేశం ప్రభుత్వంలో 12 వేల రూ,చంద్రబాబునాయుడు గారు ఇచ్చారు క్రిస్టియన్ మైనారిటీ సహోదరులకు స్వయం ఉపాధి కింద ఒక్కొక్కరికి లక్ష రూపాయలు సబ్సిడీతో 4037 మందికి 35 కోట్ల 70 లక్షల 56వేలు చంద్రబాబు ఇచ్చారని గుర్తు చేశారు క్రైస్తవ మహిళలకు తన కాళ్ల మీద నిలబడాలని ప్రతి మహిళకు కుట్టు మిషన్ ఇచ్చి ప్రోత్సహించింది చంద్రబాబు నాయుడె అని చెప్పారు క్రైస్తవ నిరుపేద కుటుంబాలు పెళ్లిళ్లు చేసుకుంటే ఒక్కొక్కరికి 50వేల రూపాయలు ఇచ్చిన చంద్రబాబుదేనని ప్రతి ఏడాది నిరుపేదలు క్రిస్మస్ ఘనంగా జరుపుకోవాలని ఉద్దేశంతో క్రిస్మస్ కానుకని కూడా ప్రవేశపెట్టారు అని అన్నారు సమాజంలో పాస్టర్స్ చేస్తున్న సేవను గుర్తించి చర్చి నిర్మాణాలకు 277 చర్చలకు 30 కోట్లు89 లక్షలు చంద్రబాబు నాయుడు ఇచ్చారని ఒకవేళ మీరు చెప్తున్నట్లుగా క్రైస్తవ పాస్టర్లకు గౌరవ వేతనం 5000 రూపాయలు రాష్ట్రంలో ఎంతమంది పాస్టర్లకు ఇచ్చారో బహిర్గతం చేయాలని మేమైతే క్రైస్తవ సమాజం పవిత్ర స్థలమైన జెరూసలేముకు మా తెలుగుదేశం ప్రభుత్వంలో 44 బ్యాచ్ లను 2029 మందిని పవిత్ర యాత్రకు పంపించడం జరిగిందని తెలిపారు నాలుగేళ్ల నుండి గుర్తురాని దళిత క్రైస్తవులు ఇంకొక ఆరు నెలలో ప్రభుత్వం దిగిపోతుందనగా దళిత క్రైస్తవుల్ని ఎస్సి హోదా కల్పిస్తున్నట్లుగా కపట నాటకం తో కేంద్రానికి లేఖ పంపడం విడ్డూరం కాదా అని ప్రశ్నించారు వీటితోపాటు క్రైస్తవులకు రావలసిన సంక్షేమ పథకాలు రద్దు చేసి క్రైస్తవులను మోసం చేశారు అని అన్నారు మా నమ్మకాన్ని వమ్ము చేశారని, మా భవిష్యత్తును నాశనం చేశారని భావించి యావత్ ఆంధ్ర రాష్ట్ర క్రైస్తవ సమాజం అందరూ కూడా చంద్రన్నే మా భవిష్యత్తుకి భరోసా అని భావించి తెలుగుదేశం పార్టీతో నడవడానికి సంసిద్ధంగా ఉన్నారని అన్నారు నేను చెప్పిన వాటిలో జగన్ రెడ్డి అండ్ కో బ్యాచ్ కి సవాల్ విసురుతున్నానని అన్నారుఈ నాలుగు సంవత్సరాల్లో వీటిలో ఒక్కటైన మీరు చేశారని, చేస్తే వాటిని నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో, బావవరపు చిన్ని, బచ్చు రాజు, బర్రి రాజ్ కుమార్, నడిగట్ల శంకర్రావు, జోసెఫ్, డానియల్, తిమోతి, సాల్మన్ తదితరులు పాల్గొన్నారు.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!