ఆచార్య ఎన్ గోపి తంగేడు పూలు తెలుగు సాహిత్యంలో కొత్త వసంత చైతన్య భావాల వెలుగులు
ప్రముఖ సాహితీవేత్త నల్లా

ఆచార్య ఎన్. గోపి తంగేడు పూలు తెలుగు సాహిత్యంలో కొత్త వసంత చైతన్య భావాలవెలుగులు
….. ప్రముఖ సాహితీవేత్త నల్లా
అమలాపురం యువతరం ప్రతినిధి;
ఆచార్య ఎన్. గోపి తొలి కవితా సంపుటి తంగేడు పువ్వులలో కొత్త వసంత చైతన్య భావాల వెలుగులు నిరంతరం అక్షర చైతన్యంతో చిగురిస్తూనేఉంటుందని ప్రముఖ సాహితీవేత్త , శ్రీ శ్రీ కళావేదిక జిల్లా అధ్యక్షులు,సీనియర్ తెలుగు లెక్చరర్ నల్లా నరసింహమూర్తి అన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ప్రముఖు సాహితీ వేత్త డాక్టర్ గోపి జన్మదినం సందర్భంగా రెండవ రోజు ప్రసంగాల పరంపర సాహిత్య సభ అంతర్జాతీయ సాహిత్య సంస్థ. శీ శ్రీ కళావేదిక, సాయి సంజీవని వాకర్స్ యోగ ఆరోగ్య సంస్థ, నానీల వేదిక సాహిత్య సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించబడిన సాహిత్య సభలో నరసింహమూర్తి ‘ఆచార్య ఎన్. గోపి.. తంగేడు పూలు కవితా వసంతం” అనే అంశంపై ప్రసంగించారు. డాక్టర్ గోపి జీవితంలోను ,కవిత్వంలోనూ నిజ వ్యక్తిత్వం లోను సాహిత్య రచన నే ప్రాణంగా భావించిన ప్రముఖ కవి అని అన్నారు. ఐదు దిశాబ్దాలుగా తెలుగు పాఠక జన హృదయంలో చైతన్యవంతంగా నడిచిపోతున్న కవి గోపి అని అన్నారు. తంగేడు పూలు కవితా సంపుటి లో31 కవితలు ఉన్నాయని అన్ని కవితలు వసంతం లా పాఠ కుల హృదయాల్లో చిగురిస్తూనే ఉంటాయని ఆయన అన్నారు. తెలుగు సాహిత్యంలో ప్రాచీన కాలం నుండి కవులు ఎన్నో పువ్వులను ఎన్నో రకాలుగా వర్ణించారని కానీ తంగేడి పూలను మరిచిపోయారని ఆ లోటు గోపి తీర్చారని నల్లా అన్నారు. మనసున్న పువ్వులుగా మమత నిండిన పువ్వులుగా పేద పువ్వులుగా సామాజిక , అక్షర సత్యాన్ని ఆవిష్కరించారని ఆయన అన్నారు. అభివృద్ధిలో కొత్త రీతి కనిపిస్తుందని ప్రకృతిని ప్రేమించే కవి డాక్టర్ గోపి అని తెలంగాణ స్త్రీల దైనందిక జీవన గాధలను హృదయాన్ని ఆకట్టుకునే విధంగా ఈ కవితా సంపుటి లో గోపి అక్షర చైతన్యంతో ఆవిష్కరించారని నరసింహ మూర్తి అన్నారు. అందరూ చదవదిగిన గొప్ప కవితా సంపుటిగా ఆయన
అభి వర్ణించారు ఈ పుస్తకాన్ని ఆచార్య గోపి తన గురువైన జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డికి అంకితం ఇవ్వడం ఆయన గురుభక్తికి నిదర్శనమని నల్లా నరసింహమూర్తి అన్నారు. సభకు ప్రముఖ కవి బీ.వి.వీ సత్యనారాయణ అధ్యక్షత వహించారు. కవి నరసింహా మూర్తిని
ముఖ్య అతిధిగా విచ్చేసిన విశ్రాంత భవిష్య నిధి అసిస్టెంట్ కమిషనర్, న్యాయవాది అద్దంకి అమరేశ్వరరావు సన్మానించారు. పదవతరగతిలో అధిక మార్కులు సాధించిన ముగ్గురు విద్యార్థులకు నగదు సహాయాన్ని ప్రొఫెసర్ డాక్టర్ శ్రీపాద రామకృష్ణ అందజేశా రు .ఈ కార్యక్రమంలో జల్లి సుజాత, మాకే బాలార్జున సత్యనారాయణ ,కడలి సత్యనారాయణ పాల్గొన్నారు.