దళితుల సమస్యలపై కౌతాళం, కోసిగి మండలంలో పర్యటన
మాల మహానాడు రాయలసీమ అధ్యక్షులు రంగయ్య

దళితుల సమస్యలపై కౌతాళం, కోసిగి మండలాలో పర్యటించిన మాలమహానాడు రాయలసీమ అధ్యక్షులు.
దళితుల పెట్టుకున్న ఫిర్యాదుల మీద రెవెన్యూ, పోలీస్ శాఖలను కలసిన సి. రంగయ్య.
దళితుల పిర్యాదు ల మీద తక్షణమే స్పందించాలని విజ్ఞప్తి
త్వరలో కౌతాళం మండలంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు సిద్ధం
ఎమ్మిగనూరు యువతరం విలేఖరి;
మాలమహానాడు జిల్లా నాయకులు మల్లేష్ ఆధ్వర్యంలో కౌతాళం, కోసిగి మండలాలలో ఆదివారం మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు రంగయ్య పర్యటించారు.ముఖ్యంగా దళితుల సమస్యలు త్రాగునీరు, విద్యుత్, స్మశాన వాటికలు వంటి మేజర్ సమస్యలమీద విశ్లేషణ చేసి అధికారులను కలిశారు. త్వరలో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ని కలిసి సమస్యలును ఆయన దృష్టికి తీసుకుని వెళ్తా అని తెలిపారు.కౌతాళం మరియు రౌడూరు పర్యటించి మాలలఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం దేవాలయం లో అందరిని సమావేశం ఏర్పాటు చేసి జాతిని ఉద్దేశించి మాట్లాడారు. జనాలనుండి భారీ స్పందన రావడం తో త్వరలో కౌతాళం మండలం లో భారీ బహిరంగ సభ ఏర్పాటు కు సన్నాహం చేయాలని అని దళిత నాయకులకు ఆయన తెలిపారు.ఎన్నికల నాటికి అందరు సిద్ధంగా ఉండాలని తెలిపారు.కౌతాళం మండల పోలీస్ స్టేషన్, రెవెన్యూ ఆఫీస్ ను సందర్శించి నాయకులు అందరిని పరిచయం చేశారు. దళితుల పిర్యాదు ల పట్ల నిర్లక్ష్యం వద్దని తెలిపారు. మాలమహానాడు ఎప్పుడు వారికి అండగా ఉంటుందని తెలిపారు. అధికారులు కూడా జాతికి చేస్తున్న ప్రజా సేవలో మీకు మీరే సాటి అని రంగయ్య కి అభినందనలు తెలిపారు. త్వరలో అన్ని మండలాలు పర్యటిస్తానని తెలిపారు. కార్యక్రమం లో జిల్లా నాయకులు మల్లేష్ యెమ్మిగనూరు యువనాయకులు రామ్ నర్సింహా, దామోదర్, జంబన్న, కౌతాళం మాలమహానాడు నాయకులు రమేష్ ,గోవిందు, వీరేష్, రమేష్, నరసింహులు,రౌడూరు మాల మహానాడు నాయకులు జట్టప్ప, గంగప్ప, అంగడి జట్టప్ప, తలారి జట్టప్ప,మాల మహానాడు నాయకులు తదితరులు పాల్గొన్నారు.