
విశాఖలో హలో ఏపీ బై బై వైసిపి
విశాఖ యువతరం ప్రతినిధి;
అమలాపురం సభలో పవన్ కళ్యాణ్ ప్రజలకి ఇచ్చిన పిలుపు మేరకు హాలో ఏపీ బై బై వైసిపి అనే కార్యక్రమాన్ని విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు పూర్ణా మార్కెట్ ఏరియాలో విశాఖ దక్షిణ నియోజకవర్గం నాయకులు శివ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. గతంలో 2014లో పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ హాటావో దేశ్ బచావో అనే నినాదంతో ఎలా అయితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేశారో అదేవిధంగా 2024లో పిల్ల కాంగ్రెస్ అయిన వైసిపిని కూడా భూస్థాపితం చేయాలని ప్రజలు బాగుండాలి అంటే అరాచకపాలన నుండి విముక్తి పొందాలి అంటే హాలో ఏపీ బై బై వైసిపి అనే నినాదాలతో ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గంలో అన్ని వార్డుల ముఖ్య నాయకులు,వీర మహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.