ANDHRA PRADESHBREAKING NEWS

బాధ్యతగా ఫీల్ కాకుంటే వెళ్లిపోండి

సచివాలయ సిబ్బంది, వాలంటీర్లకు కలెక్టర్ గౌతమి హెచ్చరిక

బాధ్యతగా ఫీల్‌కాకుంటే వెళ్లిపోండి

సచివాలయ సిబ్బంది, వాలంటీర్లకు కలెక్టర్‌ గౌతమి హెచ్చరిక

‘జగనన్న సురక్ష’ను కమిట్‌మెంట్‌తో చేయాలని సూచన

– సమాచారం ప్రతి ఇంటికీ చేరాలి : ఎమ్మెల్యే అనంత
– ప్రభుత్వ లక్ష్యాన్ని అందరూ అర్థం చేసుకోండి

  • అనంతపురం, యువతరం ప్రతినిధి;

‘‘జగనన్న సురక్ష కార్యక్రమంను రొటీన్‌గా చేయద్దు. అందరికీ కమిట్‌మెంట్‌ ఉండాలి. బాధ్యతగా ఫీల్‌ కాకుంటే వెళ్లిపోండి. ఈ కార్యక్రమంపై ఇంటెలిజెన్స్‌ రిపోర్ట్స్‌ సేకరిస్తాం. థర్డ్‌పార్టీ ఎవాల్యుయేషన్‌ ఉంటుంది. కమాండ్‌ కంట్రోల్‌ రూం నుంచి కాల్స్‌ చేస్తాం. ఎక్కడైనా సచివాలయ సిబ్బంది రాలేదు? వాలంటీర్లు మాత్రమే వచ్చారు.! లేదా ఇద్దరూ రాలేదు వంటి ఫిర్యాదులు వస్తే ఉపేక్షించను’’ అని అనంతపురం జిల్లా కలెక్టర్‌ గౌతమి సచివాలయ సిబ్బంది, వాలంటీర్లకు హెచ్చరించారు. నగరంలోని రహమత్‌నగర్‌లో శనివారం సాయంత్రం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డితో కలిసి ‘జగనన్న సురక్ష’ గృహ సందర్శన కార్యక్రమాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు ఇళ్ల వద్ద డేటా ఎలా సేకరిస్తున్నారో చూసి పలు సూచనలు చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించి ప్యాకెట్‌ క్యాలెండర్‌ను ప్రతి ఇంటికీ అందించాలన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమానికి సంబంధించి క్యాంపుల వివరాలను ముందుగానే తెలియజేయాలన్నారు. ఈ నెలాఖరు వరకు డేటా సేకరించే సమయంలోనే సంబంధించి డాక్యుమెంట్లు అందుబాటులో ఉంచుకోవాలని తెలియజేయాలన్నారు. జూలై 1వ తేదీ నుంచి ఎక్కడెక్కడ క్యాంపులు నిర్వహిస్తారు? అక్కడ ఏఏ సేవలు ఉచితంగా అందిసాము? అనే వివరాలను తెలపాలన్నారు. అనంతరం స్థానికులతో కలెక్టర్‌ గౌతమి, ఎమ్మెల్యే అనంత మాట్లాడారు. సచివాలయాల వద్ద సేవలు ఎలా అందుతున్నాయో ఆరా తీశారు. గతంలో ఏ సమస్య పరిష్కారం కోసమైనా సచివాలయానికి వెళ్లారా? అక్కడ సిబ్బంది స్పందిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. జగనన్న సురక్ష కార్యక్రమ సమాచారం తమకు రాలేదని కొందరు చెప్పడంతో సమస్య ఎందుకొచ్చిందో ఆరా తీశారు. సిబ్బంది తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వాట్సాప్‌ సమాచారంతో పాటు ఎస్‌ఎంఎస్‌లు, వాయిస్‌ రికార్డింగ్‌ ద్వారా సమాచారం చేరవేయాలన్నారు. ఉద్యోగులు, వాలంటీర్లు బాధ్యతగా పని చేయాలన్నారు. ప్రభుత్వం ఎందుకు కార్యక్రమం చేస్తోంది? ఇది ఎలా ఉపయోగడపడుతుందో సమగ్రంగా తెలియజేయాలని కలెక్టర్‌ గౌతమి, ఎమ్మెల్యే అనంత స్పష్టం చేశారు. ఎంతో ఉన్నత లక్ష్యంతో జగనన్న సురక్ష చేపడుతున్నామని, విధి నిర్వహణ విషయంలో ఎవరూ నిర్లక్ష్యం వహించొద్దన్నారు. గడప గడపకు వెళ్లే సమయంలో ఎలాగైతే స్థానికులకు సమాచారం ఇచ్చామో అదే విధంగా జగనన్న సురక్ష సమాచారం ప్రతి ఇంటికీ వెళ్లాలని ఎమ్మెల్యే అనంత తెలిపారు. కాగా కొందరు సిబ్బంది యూనిఫాం వేసుకోకపోవడంపై కలెక్టర్‌ గౌతమి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమం జరిగే సమయంలో యూనిఫాం తప్పనిసరిగా వేసుకోవాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కమిషనర్‌ రమణారెడ్డి, కార్పొరేటర్‌ హసీనా, కో ఆప్షన్‌ సభ్యురాలు మార్త, డివిజన్‌ కన్వీనర్‌ సుకేష్, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!