
త్రాగినీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తా
జెడ్పిటిసి పులికొండ నాయక్
తుగ్గలి యువతరం విలేఖరి;
మండలంలోని పలు గ్రామాలలో ఉండే మంచినీటి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని జడ్పిటిసి పులికొండ నాయక్ అన్నారు. శుక్రవారం జొన్నగిరి గ్రామం లో జిల్లా పరిషత్తు నిధుల తో మంచినీటి పథకానికి కరెంటు సరఫరా చేసేందుకు జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జొన్నగిరి గ్రామంలో మంచినీటి సమస్య పరిష్కరించేందు కు ఎమ్మెల్యే శ్రీ దేవమ్మ ఆదేశాల మేరకు రూ 5 లక్షలు జిల్లా పరిషత్తు నిధులను మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. అందువల్ల నిర్వాహకులు ఈ పనులు త్వరగా పూర్తిచేసి జొన్నగిరికి మంచినీరు సరఫరా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్ సోమశేఖర్ రెడ్డి, వైసీపీ నాయకులు దివాకర్, హనుమన్న తదితరులు పాల్గొన్నారు.