
మతసామరస్యాలకు అతీతంగా బక్రీద్ పండుగను జరుపుకుందాం,జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్
శాంతియుత వాతావరణం లో బక్రీద్ పండుగను జరుపుకుందాం, ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్.
ఆదోని యువతరం ప్రతినిధి;
మతసమరస్యాలకు అతీతంగా బక్రీద్ పండుగను జరుపుకుందామని జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ పేర్కొన్నారు. గురువారం ఆదోని పట్టణంలో మున్సిపల్ కార్యాలయం నందు పీస్ (శాంతి) కమిటీ సమావేశం నిర్వహించారు. జూన్ 29వ తేదీన బక్రీద్ పండుగ సందర్భంగా హిందూ, ముస్లిం మత పెద్దల మరియు అధికారాల ఆధ్వర్యంలో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ…. మతసమరస్యాలకు అతీతంగా బక్రీద్ పండుగ నిర్వహించుకుందామని అన్నారు. సోదర భావాలతో మరియు ఐక్యతతో పండుగను నిర్వహించుకోవాలని మత పెద్దలకు సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, పండుగ రోజు పటిష్టమైన భద్రతను నిర్వహించి ఎటువంటి అవాంఛనీయమైన జరగకుండా చూసుకోవాలని పోలీస్ సిబ్బందికి సూచించారు.
ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ మాట్లాడుతూ… శాంతియుత వాతావరణం లో బక్రీద్ పండుగ నిర్వహించుకోవాలన్నారు. ఈ సందర్భంగా మసీద్ వద్ద మౌలిక వసతులు కల్పించాలని పలువురు పెద్దలు సబ్ కలెక్టర్ ను కోరగా స్పందించిన ఆయన అన్ని ఏర్పాట్లు చేయిస్తామని హామీ ఇచ్చారు. పండగ రోజు శానిటేషన్ మరియు త్రాగునీరు ఇబ్బందులేకుండగా చూసుకోవాలని మున్సిపల్ కమిషనర్ కు ఆదేశించారు.
అంతకుముందు జిల్లా ఎస్పీ పట్టణంలోని శ్రీ మహాయోగి లక్ష్మ అవ్వను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి గుడి పెద్దలు అవ్వ వారి తీర్థప్రసాదాలు, అందజేసి శేష వస్త్రం కప్పి ఫలమంత్రాక్చితలు ఆశీర్వాదించారు. అనంతరం రాష్ట్రంలో అతి పురాతన మసీద్ దైన ఆదోని పట్టణంలో షాహి జామియా మసీదును కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్, ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ గారు సందర్శించారు. అనంతరం ఖతీబ్ జునైద్ హష్మీ వారు ప్రత్యేక ప్రార్థనలు చేసి మజీద్ పెద్దలు జిల్లా ఎస్పీ ను మరియు ఆదోని డివిజన్ సబ్ కలెక్టర్ గారిని శాలువా మరియు పూలమాల తో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ శాంత, ఆదోని డీఎస్పీ శివ నారాయణ, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శిశిర దీప్తి, తహశీల్దారు వెంకటలక్ష్మి, తదితరులు అధికారులు పాల్గొన్నారు.