రిషికేష్ బయలుదేరిన స్వామి స్వరూపానందేంద్ర
రిషికేష్ బయలుదేరిన స్వరూపానందేంద్ర
విశాఖ యువతరం ప్రతినిధి;
చాతుర్మాస్య దీక్ష చేపట్టేందుకు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి బుధవారం రిషికేష్ పయనమయ్యారు. విశాఖ విమానాశ్రయం నుంచి బయలుదేరి ఢిల్లీ వెళతారు. అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా రిషికేష్ చేరుకుంటారు. అక్టోబరు 5వ తేదీ వరకు స్వరూపానందేంద్ర స్వామి రిషికేష్ వద్ద గంగాతీరంలో ఉన్న విశాఖ శారదాపీఠం ఆశ్రమంలోనే ఉంటారు. దాదాపు 115 రోజులపాటు అక్కడే ఉంటారు. ఏటా చాతుర్మాస్య దీక్షను రిషికేష్ లో నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. రిషికేష్ బయలుదేరే ముందు పీఠం అధిష్టాన దైవం రాజశ్యామల అమ్మవారు, ఆరాధ్య దైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగద్గురు శంకరాచార్య వేద పాఠశాల విద్యార్థులు గురువందనం సమర్పించారు. పీఠం భక్తులు స్వరూపానందేంద్ర స్వామికి వీడ్కోలు పలికారు.