ANDHRA PRADESHWORLD

కష్టపడి చదివితే ఎవరికైనా ఫలితం దక్కుతుంది, టీటీడీ ఈవో ధర్మారెడ్డి

కష్టపడి చదివితే ఎవరికైనా ఫలితం దక్కుతుంది : టిటిడిఈ ఓ ధర్మారెడ్డి

నిశ్చల్ నారాయణ్ ఫౌండేషన్ నుండి రూ.25 లక్షల విలువైన పుస్తకాలు అందజేసిన నిశ్చల్

పాఠశాలలో చదివే విద్యార్థుల చదువులకు భరోసా ఇచ్చిన టిటిడి ఈ ఓ ధర్మారెడ్డి

జీవితంలో ఏదైనా సాధించాలంటే కష్టపడాలి

విద్యార్థులు జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవాలి

మనం ఏ స్థాయిలో ఉన్న మన విజయానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కారణం

నిశ్చల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు నిశ్చల్ నారాయణ్

జూపాడు బంగ్లా యువతరం విలేఖరి;

జీవితంలో ఎవరైనా సరే కష్టపడితే తప్పనిసరిగా ఫలితం దక్కుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఓ ఏ వి ధర్మారెడ్డి పేర్కొన్నారు. జూపాడుబంగ్లా మండలం పారుమంచాల గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణంలో టిటిడి ఈ ఓ ఏ వి ధర్మారెడ్డి అధ్యక్షతన ఆయన పిలుపు మేరకు పాఠశాలకు నిశ్చల్ నారాయణ్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో రూ.25 లక్షలు విలువైన ల్యాబ్ మెటీరియల్స్ మరియు పుస్తకాలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నిశ్చల్ ఫౌండేషన్ చైర్మన్ మరియు టిటిడి మాజీ బోర్డ్ డైరెక్టర్ నిశ్చల్ నారాయణ్, నాగేశ్వరరావు, పద్మావతిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టిటిడి ఈ ఓ ఏ వి ధర్మారెడ్డి మాట్లాడుతూ ఈ పాఠశాలలోనే ఎంతో మంది చదువుకొని పెద్ద పెద్ద స్థాయిలో ఉద్యోగాల్లో ఉన్నారన్నారు. 1 తరగతి నుండి 10వ తరగతి వరకు నేను ఈ స్కూల్ లో చదువుకున్నానని గుర్తు చేశారు. ఈ స్కూల్లో చదివి ఈ స్థాయిలో ఉన్నారా అని ఆశ్చర్యపోయారని కానీ కష్టపడి చదివితే ఏదైనా సాధించవచ్చని పేర్కొన్నారు. ఈ సమావేశ ముజ్య ఉద్దేశ్యం ఏమంటే నా మిత్రులు నాగేశ్వరరావు నాతో కలిసి టిటిడి బోర్డ్ మెంబర్ గా నాలుగేళ్లు కలిసి పని చేశారన్నారు. ఈయన కుమారుడు నిశ్చల్ నారాయణ్ చాలా ఇంటలిజెంట్ అని అన్నారు. అతి తక్కువ వయస్సులో మ్యాథ్స్ లో దిట్ట అని వారి ఫౌండేషన్ ద్వారా మా గ్రామంలో ఉన్న పాఠశాలకు నాలుగు ల్యాబ్ లు మరియు విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వాలని మా ఊరి పిల్లల్ని గొప్పగా చదివించాలనే సంకల్పంతో వారిని పిలవడం జరిగిందన్నారు. అందుకు నిశ్చల్ వారి ఫౌండేషన్ ద్వారా రూ.25 లక్షలు విలువైన నాలుగు రకాల ల్యాబ్ మెటీరియల్స్, పుస్తకాలు అందజేసేందుకు రావడం అభినందనీయమన్నారు. నిశ్చల్ నారాయణ్ తాను స్వయంగా తయారు చేసిన నాలుగు రకాల ల్యాబ్ లు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్ ల్యాబ్ కిట్లు, ఇచ్చిన మెటీరియల్స్ పై ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారని బాగా నేర్చుకొని విద్యార్థులకు శ్రద్ధగా చదువులు చెప్పాలని అన్నారు. విద్యార్థులు కూడా శ్రద్ధగా విని బాగా చదువుకోవాలని అన్నారు. అవసరమైతే పాఠశాలకు నిశ్చల్ ఆధ్వర్యంలో ఫౌండషన్ తరపున ఇద్దరు ఉపాధ్యాయులను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. నిశ్చల్ ఫౌండేషన్ అధినేత నిశ్చల్ నారాయణ్ మాట్లాడుతూ మనము ఏ స్థాయిలో ఉన్న దానికి కారణం ఉపాధ్యాయులు, తల్లిదండ్రులే కారణమన్నారు. ప్రతి విద్యార్థికి ఉపాధ్యాయులు మంచి విద్యను ఇస్తే తప్పకుండా విజయం సాదించవచ్చన్నారు. జీవితంలో విద్యార్థులు కష్టపడి చదివితేనే ఏదైనా సాధిస్తారన్నారు. చదువు విషయంలో ఏకాగ్రతను కోల్పోకూడదన్నారు. నేను సి ఏ 5సంవత్సరాల కోర్స్ చదివేటప్పుడు వంద మందిలో కేవలం ముగ్గురు మాత్రమే క్వాలిఫై అవుతారని అంతా కఠినమైన కోర్స్ అని అన్నారు.నాకు 9 ఏళ్ళ వయస్సులో గణితంలో అష్టావధానం చేశానన్నారు. 11 ఏళ్ళ వయస్సులో గణిత ప్రయోగశాలను డిజైన్ చేశానని 2006లో అప్పటి రాష్ట్రపతి తో అవార్డు అందుకున్నానన్నారు. ప్రతి సంవత్సరం కొత్త కొత్త డిజైన్స్ గణితంలో చేస్తూ వుంటానన్నారు. 2006లోనే గణితంలో రీసెర్చ్ మొదలు పెట్టానని అప్పటి రాష్ట్రపతి ఏ పి జే అబ్దుల్ కలాం పురస్కారం అందుకున్నామన్నారు. విద్యార్థులకు నిశ్చల్ నారాయణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందించే ఈ మెటీరియల్స్, ల్యాబ్స్ విద్యార్థులకు వారి భవిష్యత్ కు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులకు అర్ధమయ్యే విధంగా ఉపాధ్యాయులు చదువులు చెప్పాలని అన్నారు. అనంతరం విద్యార్ధులకు నిశ్చల్ పౌండషన్ వారు పుస్తకాలను అందజేశారు. పాఠశాలకు ల్యాబ్ మెటీరియల్స్ కిట్లు టిటిడి ఈ ఓ ఏ వి ధర్మారెడ్డి ఆధ్వర్యంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి మాజీ బోర్డ్ మెంబర్ నాగేశ్వరరావు, ఆర్ టీ సి నంద్యాల జిల్లా ఆర్ ఎం శ్రీనివాసులు, బిల్డర్ మరియు కాంట్రాక్టర్ ఏ పి , తెలంగాణ నరెద్దుల శ్రీనివాస రెడ్డి, పి ఆర్ డి ఈ ఈదుల నాగిరెడ్డి, నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి, తర్తుర్ సర్పంచ్ నాగిరెడ్డి, గ్రామ పెద్ద లు ఈదుల నారాయణ రెడ్డి, యోగేశ్వర రెడ్డి, వైకాపా నాయకులు హేమశేఖర్ రెడ్డి, దేవ సహాయం, జూపాడుబంగ్లా ఎస్ ఐ వెంకట సుబ్బయ్య, ఏ ఎస్ ఐ మేరీ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు లక్ష్మన్న, కృష్ణయ్య, మద్దయ్య, తదితరులు పాల్గొన్నారు.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!