ANDHRA PRADESHBREAKING NEWSCRIME NEWSSTATE NEWS

ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి కె .లక్ష్మీనాథ్ ….

మండలంలోని లంచగొండి అధికారులకు ఇది ఒక కనువిప్పు

ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి కె .లక్ష్మీనాథ్

వెల్దుర్తి జూన్ 16 యువతరం న్యూస్:

కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తి మేజర్ గ్రామపంచాయతీ కార్యదర్శి కే .లక్ష్మి నాథ్ మంగళవారం ఏసీబీ అధికారులకు పట్టుబడిన వైనం వెలుగు చూసింది. వెల్దుర్తి పట్టణానికి చెందిన సంధ్యపోగు సతీష్ నుండి తన ఇంటి పన్ను కట్టించుకోవడానికి మరియు ఇంటి అప్రూవల్ చేయడానికి లంచం రూ. 40 వేలను తీసుకుంటుండగా పట్టుబడినాడని తెలిపారు. పంచాయతీ కార్యదర్శి కె. లక్ష్మీనాథ్ 50 వేలరూపాయలు అడుగగా ఇందులో 40 వేల రూపాయలు అడ్వాన్సుగా ఇస్తుండగా కర్నూల్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ సోమన్న ఆయన బృందం ఇన్స్పెక్టర్ బి కృష్ణయ్య, ఎస్సై రాజు, ప్రభాకర్, హెడ్ కానిస్టేబుల్ సుబ్బరాయుడు, దొరబాబు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని తెలియజేశారు.ఆయనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నామని తెలిపారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!