ANDHRA PRADESHPROBLEMS

ప్రమాదకరంగా మారిన రహదారి

ప్రమాదకరంగా మారిన రహదారి

కోడుమూరు జూన్ 3 యువతరం న్యూస్.

కోడుమూరు పట్టణంలో చిన్న బోయ వీధి నుంచి కొత్త బస్టాండ్ కు వెళ్లే ప్రధాన రహదారి పై పెద్ద గుంత ఏర్పడి ప్రమాదకరంగా మారింది. ఈ రహదారి గుండా కొత్తపేట వీధికి వెళ్లే రహదారి సైతం ఉండడంతో మలుపు ప్రమాదకరంగా తయారయింది. ఈ గుంత చాలా సంవత్సరాల క్రితం పడిన దీనికి తోడు ఆ గుంత పక్కనే గత రెండు నెలల క్రితం త్రాగునీటి పైపులైను మరమ్మత్తు కోసం మరొక గుంత ఏర్పాటు చేసి పైపులైన్ వేసి మట్టితో పూడ్చారు. గత పది రోజుల నుంచి కురుస్తున్న వర్షం కారణంగా మట్టి కొట్టుకొని పోయి ఒక పెద్ద గొయ్యి మాదిరిగా తయారయ్యి వాహనదారులకు శాపంగా మారింది. ఈ ప్రధాన రహదారి వెంట చిన్నబోయ వీధి, కొత్తపేట వీధి , కొత్త బస్టాండ్ కి వెళ్లే ప్రజలు వాహనదారులకు ముఖ్యం కావడంతో అధిక సంఖ్యలో వాహనాలు ప్రజలు ఈ రహదారి గుండా వెళుతూ ఉంటారు. ఉదయం వేలలో అయితే సరే కానీ రాత్రి సమయంలో ఏవైనా ప్రమాదాలు జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఉన్నతాధికారులు స్పందించి ఈ ప్రధాన రహదారిపై ఉన్న గుంతను పూడ్చి రహదారిని బాగు చేయాలని స్థానికులు, ప్రజలు కోరుతున్నారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!