అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ పిల్లల వార్డులో దారుణ సంఘటన
మూడు రోజుల పసికందు మృతి

అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ పిల్లల వార్డులో దారుణ సంఘటన
వైద్యుల నిర్లక్ష్యం
పిల్లల వార్డులోవైద్యుల కొరత
కరెంటు ట్రీట్మెంట్ లేకపోవడం
ఫలితంగా మూడు రోజుల పసికందు మృతి
అనకాపల్లి ప్రతినిధి
ఏప్రిల్ 4 యువతరం న్యూస్ :
అనకాపల్లి నియోజకవర్గం ఎన్టీఆర్ వైద్యాలయంలో సిబ్బంది నిర్లక్ష్యం తో మూడు రోజుల పసికందు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది .బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జాతీయ మానవ హక్కుల మండలి చోడవరం మాడుగుల ప్రాంతీయ మండలి సెక్రెటరీ పండూరు పైడినాయుడు ఒక పత్రికా ప్రకటన ద్వారా
ఖండించారు.
శిశువు మృతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.వైద్యుల నిర్లక్ష్యంపై విచారణకు డిమాండ్ చేశారు.
. పసికందు కుటుంబ సభ్యులకు తగున్యాయం చేయాలని ,బాధ్యులను శిక్షించాలనీ
అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వ వైద్యాలయంలో చోటుచేసుకున్న పసికందు మృతి ఘటన అత్యంత దురదృష్టకరమని పండూరు పైడినాయుడు విచారం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
_మూడు రోజుల పసికందు చిన్న పిల్లల వార్డులో సరైన వైద్య సదుపాయాలు,వైద్యుల లభ్యత లేకపోవడం వల్ల మృతి చెందడం అత్యంత విషాదకరమని పేర్కొన్నారు…ఇది పూర్తిగా వైద్యుల కొరత మరియు ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే జరిగిందని ఆరోపించారు…ఈ ఘటనపై వెంటనే సమగ్ర విచారణ జరిపి నిజాలు బయటపెట్టాలని,బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు..భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.మృతిచెందిన పసికందు కుటుంబానికి న్యాయం చేయాలని,అవసరమైన పరిహారం అందించాలని కూడా కోరారు_.



