ANDHRA PRADESHOFFICIALSTATE NEWS

రైతుల సంక్షేమమే మంత్రి అనగాని ధ్యేయం

రైతుల సంక్షేమమే మంత్రి అనగాని ధ్యేయం

రేపల్లె మార్చి 18 యువతరం న్యూస్:

రైతుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ రేపల్లె నియోజకవర్గంలోని రైతులకు మేలు చేసే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్‌ఎం డ్రైన్ మరియు ఓల్డ్ కోర్స్ డ్రైన్ పూడికతీత పనుల కోసం మొత్తం రూ.19 కోట్లు 39 లక్షల 80 వేల నిధులను మంజూరు చేశారు.
ఈ నిధులలో భాగంగా ఆర్‌ఎం డ్రైన్ 5వ కిలోమీటర్ నుండి 25.2 కిలోమీటర్ వరకు పూడికతీత పనులకు రూ.7 కోట్లు 50 లక్షల 30 వేలు కేటాయించారు. అలాగే ఆర్‌ఎం డ్రైన్ ఓల్డ్ కోర్స్ పూడికతీత పనులకు రూ.6 కోట్లు 99 లక్షల 50 వేలు మంజూరు చేశారు. అదనంగా ఆర్‌ఎం డ్రైన్ 0 నుండి 5 కిలోమీటర్ వరకు డ్రెడ్జింగ్ పనులకు రూ.4.90 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం ఆర్‌ఎం డ్రైన్ మరియు ఓల్డ్ కోర్స్ డ్రైన్లు పూడిపోయి ఉండటంతో పరిసర ప్రాంతాల పొలాలు ముంపుకు గురై రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. ఈ సమస్యను గుర్తించిన మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు తక్షణమే స్పందించి నిధుల మంజూరుకు చర్యలు తీసుకోవడం విశేషం. రైతుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్న మంత్రి అనగానికి నగరం, చెరుకుపల్లి, నిజాంపట్నం మండలాల రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!