ANDHRA PRADESHPROBLEMSSTATE NEWS

మంచినీళ్లు కోసం గుర్రాల మీద 2 కిలోమీటర్లు ప్రయాణించ వలసిందే.

మంచినీళ్లు కోసం గుర్రాల మీద 2 కిలోమీటర్లు ప్రయాణించ వలసిందే.

అనకాపల్లి ప్రతినిధి మార్చి 11  యువతరం న్యూస్:

అనకాపల్లి జిల్లా వి మాడుగుల మండలం ఆవురువాడ పంచాయతీ పరిధి లో పశువులు బంద కొండ శిఖర గ్రామంలో పి వి టి జి కొందు ఆదివాసీలకు మంచినీరు సౌకర్యం లేకపోవడంతో,
మంచినీరు కోసం
జీ లుగులో గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరం గడ్డ చలమనుండి నీళ్లు తెచ్చుకుంటున్నారు.
ప్రతిరోజు ఉదయం గుర్రాల మీద బిందెలు మోసుకొస్తున్నారు.
ఈ నీరు తాగడం తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు ,
రోడ్డు సౌకర్యం లేకపోవడంతో డోలు కట్టుకొని. రావికమతం మండలం లో
చిములపాడు పంచాయతీ దాని మాని సెంటర్ వద్దకు డోలు కట్టుకొని తీసుకొచ్చే పరిస్థితి నెలకొని ఉంది . మంచినీళ్లు కోసం ప్రజా ఫిర్యాదు వేదిక ఏ ఎన్ పి ఎల్ 202504282819 తేదీ :28-4-2025 నా ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదుకు జిల్లా పరిషత్ జనరల్ ఫండ్ నుండి నాలుగు లక్షల రూపాయలు ట్యాంకు మరియు పైప్ లైన్ ద్వారా వీరి నీటి సౌకర్యం కోసం నిధులు మంజూరు చేశారు. అసిస్టెంట్ ఇంజనీర్ పశువుల బంద్ గ్రామాన్ని పరిశీలన చేశారు.
ట్యాంక్ నిర్మాణం కోసం. ఇసుక. పిక్క., గుర్రాల ద్వారా పశువుల బంద్ గ్రామానికి నడపడం జరిగింది. నేటికీ ఆరు నెలలు అవుతున్న ఎటువంటి పనులు చేపట్టలేదు. వేసవికాలం రావడంతో గుర్రాలతో బిందులు మోసుకెళ్లే పరిస్థితి ఆదివాసులకు ఏర్పడింది.ఇంటింటి కొళాయిలు వేస్తామని చెప్పి, నెలలు దాటుతున్న అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.
దీనికోసం అధికారులకు అనేకసార్లు తెలియజేసిన త్వరలోనే పూర్తి చేస్తాం అంటున్నారు. నేటికీ పని పెట్టకపోవడంతో రెండు కిలోమీటర్ల దూరం జీలుగులో గ్రామానికి వెళ్లి గుర్రాల సహాయంతో నీళ్లు తెచ్చుకుంటున్నాము. తక్షణమే మంచినీరు ట్యాంకు నిర్మాణం చేసి, పైపుల ద్వారా కొళాయిలు ఇప్పించాలని. సేదరి కామేశ్వరరావు. సేదరినాయుడు. సీద రు చిలకమ్మా తదితరులు
కొండ శిఖర గ్రామానికి పశువుల బంధ నాలుగు లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసి నేటికీ సంవత్సరం అవుతున్న అధికారులు పట్టించుకోవడం అన్యాయం అని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు జరగబోయే జిల్లా పరిషత్ పాలకవర్గ సమావేశం వద్ద కాళీ బిందువులతో ఆందోళన నిర్వహించ నున్నట్లు వారు తెలియపరిచారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!