ANDHRA PRADESHPROBLEMSSTATE NEWS

టమాటా రైతుల ఆవేదన — కిలో రూ.2కి పడిపోయిన ధర

టమాటా రైతుల ఆవేదన — కిలో రూ.2కి పడిపోయిన ధర

దేవరాపల్లి మార్కెట్లో టమాటా రైతుల కష్టాలు — మద్దతు ధర కోరుతూ కలెక్టర్‌కి వినతి

అనకాపల్లి బ్యూరో ఇంచార్జ్ మార్చ్ 04 యువతరం న్యూస్:

దేవరాపల్లి హోల్సేల్ కాయగూరలు మార్కెట్లో టమాటాకు ఇతర కాయగూరలకు మద్దతు ధర ప్రకటించి మార్క్ టింగ్ ద్వారా కాయగూరలు కోనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్వవసాయకార్మికసంఘం సంఘం జిల్లా ప్రదాన కార్యదర్శి డి వెంకన్న రైతు సంఘం జిల్లా కోశాధికారి గండినాయన్ బాబు బుధవారం జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు అనంతరం వారు వీలెకర్లుతో మాట్లాడారు దేవరాపల్లి మండల కేంద్రంలో టమోటా ధర పూర్తిగా పతనమైయింది టమాటా ధర రోజు రోజుకు తగ్గి పోవడంతో రైతులు నిరాశ చెందు తున్నారు మంగళవారం మార్కెట్ కి తీసు కొచ్చిన టమోటాలను రైతులు రోడ్డు పైనే పార బోసి వెనుతిరిగారు ఒక్కసారిగా కిలో టమోటా రెండు రూపాయిలకు పడి పోవడంతో చేసే దేమీ లేక రైతులు దిక్కుతోచని స్తితిలో రోడ్డుపై పార బోసి వెళ్ళిపో యారు మండలం లోని పలు గ్రామాలనుండి ఇతర మండలాలు నుండి రైతులు విస్తారంగా టమాటాతో పాటు ఇతర కాయగూరలు పంటను పండిస్తున్నారు పంటలు ఆశాజనకంగా ఉండడంతో రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈపంటను మార్కెట్ కి తరలించే సమయానికి దళారి వ్యాపారులు ఓక్కటై సిండికేట్ గా ఎర్పడి రైతులను మోసం చేస్తున్నారు ధర ఒక్క సారిగా తగ్గించే యడంతో రైతుల ఆశలు నిరాశలు అయ్యాయి .కనీసం ప్రభుత్వ గిట్టుబాటు ధర ఇచ్చే విదంగా చర్యలు తీసుకోక పోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దేవరాపల్లి కాయగూరలు మార్కెట్ కు 50 ఎళ్ళు చరిత్ర ఉంది ఒక ప్పుడు ఇక్కడ పండించే వంకాయి ఇతర కాయ గూరలకు భరంపురం ఒరిస్సా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అయ్యేవి రానురాను దళారి వ్యాపారులు బెడద ఎక్కువగా ఉంటుంది రెండవ ప్రక్కన ప్రభుత్వం మార్కెట్ లో కోల్ట్ స్టోరేజ్ వంటి సౌకర్యం కల్పించక పోవడం ఎండైన వానలు అయిన పసువులు కన్న అద్వాన్నంగా రోడ్డు పైనె రైతులు నిలబడి ఉండటం జరుగుతుంది మేజర్ పంచాయతీ అయిన లక్ష లాది రూపాయలు అశీళ్ళు వసూళ్ళు చేస్తున్న కనీసం రైతులకు మంచినీళ్లు సౌకర్యం అయిన కల్పించక పోవడం లెదు ఈప్రాంతంలో కాయగూరల రైతులను,,, మార్కెట్ ను ప్రాత్స హించవలసిన అవసరం ఉంది ప్రభుత్వమే మద్దతు ధర ఇచ్చి కోనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోల్ట్ స్టోరేజిని ఎర్పాటు చేయాలి,రైతులు నుండి అశీళ్ళువసూళ్ళు వెంటనే నిలుపుదల చేయాలి మార్కెట్ లో రైతులకు నీడ మంచి నీళ్లు సౌకర్యం వంటివి కల్పించాలి ఈమార్క్టను రైతు బజారు క్రిందమార్పుచేసి రైతులకు కార్డులు మంజూరు చేయాలని కోరారు,

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!