రైల్వే సమస్యల పై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కు వినతిపత్రం సమర్పించిన ఎంపీ బస్తిపాటి నాగరాజు

రైల్వే సమస్యల పై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కు వినతిపత్రం సమర్పించిన ఎంపీ బస్తిపాటి నాగరాజు
కర్నూలు ప్రతినిధి ఫిబ్రవరి 12 యువతరం న్యూస్:
జిల్లాలో నెలకొన్న రైల్వే సమస్యలను పరిష్కరించాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను ఎంపీ బస్తిపాటి నాగరాజు కోరారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో పాల్గొంటున్న ఆయన, ఢిల్లీలోని కేంద్ర మంత్రి కార్యాలయంలో మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిసి సమస్యల పై వినతి పత్రం సమర్పించారు..ఈ సందర్భంగా కర్నూలు నుంచి విజయవాడ మీదుగా విశాఖపట్నం వరకు కొత్త రైలు సర్వీసులను ప్రవేశపెట్టడం తో పాటు, విశాఖపట్నం నుంచి మహబూబ్ నగర్ వరకు ఉన్న ఎస్.ఎఫ్ రైలును కర్నూలు వరకు పొడగించాలని, ప్రమాదకర స్థితికి చేరుకుంటున్న ఆదోని పట్టణంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జి కి మరమ్మత్తులు చేయించాలని , లేదా కొత్త బ్రిడ్జి ని ఏర్పాటు చేయాలని, మద్దికెర వద్ద రైల్వే హల్ట్ మరియు స్టాప్ లను నిలిపివేసిన యశ్వంత్ పూర్, అమరావతి, విజయవాడ ఎక్సప్రెస్ రైళ్లను తిరిగి నిలిపేలా చూడాలని, అలాగే పంచాలింగాల వద్ద ఉన్న రైలు వ్యాగన్ పరిశ్రమ పనులను త్వరగా పూర్తి చేయాలని మంత్రిని ఎంపీ కోరారు. సమస్యల పై సానుకూలంగా స్పందించిన మంత్రి అశ్విని వైష్ణవ్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు ఎంపీ నాగరాజు తెలిపారు.



