శ్రీశైల మహా క్షేత్రం నందు బృంగివాహనంపై భక్తులకు దర్శనమిస్తున్న శ్రీ స్వామి అమ్మవార్లు


శ్రీశైల మహా క్షేత్రం నందు బృంగివాహనంపై భక్తులకు దర్శనమిస్తున్న శ్రీ స్వామి అమ్మవార్లు
శ్రీశైలం ప్రతినిధి ఫిబ్రవరి 10 యువతరం న్యూస్:
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మహా క్షేత్రం నందు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల 2 రోజు సందర్భంగా శ్రీ స్వామి అమ్మవార్లు బృంగి వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. అత్యద్భుతంగా కళాకారులచే డప్పులు, మంగళ వాయిద్యాలు మహా అద్భుతంగా గ్రామోత్సవం నిర్వహించబడింది. భక్తుల రద్దీ అధికంగా ఉన్నందున శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి అధిక సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలియజేశారు. ఫిబ్రవరి 8 నుంచి ఫిబ్రవరి 18 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా నిర్వహించబడతాయి. ఫిబ్రవరి 8 నుంచి ఫిబ్రవరి 12 వరకు ఇరుముడి స్వాములకు మాత్రమే స్పర్శ దర్శనాన్ని కల్పించబడుతుందని ఆలయ చైర్మన్ పోతుకుంట రమేష్ నాయుడు తెలిపారు. మరియు శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనం తరువాత భక్తులకు ఉచిత లడ్డు పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబడ్డాయి.



