ఉత్తమ కంటి డాక్టర్ గా చిరంజీవి
రాష్ట్రంలో అత్యధిక ఆపరేషన్లు చేసిన ఘనత చిరంజీవి సొంతం

ఉత్తమ కంటి డాక్టర్ గా చిరంజీవి
ఏడాది లో 411 కంటి ఆపరేషన్లు
రాష్ట్రంలో అత్యధిక ఆపరేషన్లు చేసిన ఘనత చిరంజీవి సొంతం
ఎమ్మిగనూరు ప్రతినిధి ఫిబ్రవరి 9 యువతరం న్యూస్:
ఎమ్మిగనూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కంటి వైద్యులు గా పని చేస్తున్న పి చిరంజీవి ఎంఎస్, అప్తల్ రాష్ట్రంలోనే ఉత్తమ డాక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. 2025 ఏడాది కు గాను ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రి లో 411 కంటి ఆపరేషన్లు చేసి రికార్డు సృష్టించారు. ఇది ఒక గొప్ప పరిణామంగా భావించవచ్చు. ఇలాంటి వైద్యులు సేవలు ఎమ్మిగనూరు ప్రజలకు ఎంతో అవసరం. 2026 జనవరి 1 వ తేదీన కంటి డాక్టర్ పి చిరంజీవి ను బెస్ట్ డాక్టర్ గా గుర్తిస్తూ రాష్ట్ర హెల్త్ మెడికల్ అండ్ మెడికల్ హెల్త్ సెకండరీ డైరెక్టర్ కేవిఎన్ చక్రధర్ బాబు ( ఐఏఎస్) లేఖ పంపారు. చిరంజీవి బెస్ట్ డాక్టర్ గా గుర్తించి ప్రశంస పత్రం పంపారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం ఇస్కాల గ్రామానికి చెందిన డాక్టర్ పి చిరంజీవి మొదటి మొదటిగా 2020 లో ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రి లో ఉద్యోగం లో చేరారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రజలకు మెరుగైన కంటి వైద్య సేవలు అందిస్తున్నారు. ఉద్యోగంలో చేరినప్పటి నుండి ఇప్పటి వరకు 5 ఏళ్లలో దాదాపు 2 వేల కంటి ఆపరేషన్లు చేశారు. ఉత్తమ డాక్టర్ గా ఎంపికైన చిరంజీవి ను ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపర్దేంట్ డాక్టర్ ఆది నాగేష్ తో ఇతర వైద్యులు, నర్సులు,ల్యాబ్ టెక్నీషన్,లు సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.



