బినిగేరి నుంచి ఇరుముడితో శ్రీశైలంకి శివ స్వాములు


బినిగేరి నుంచి ఇరుముడితో శ్రీశైలంకి శివ స్వాములు
ఆస్పరి ఫిబ్రవరి 9 యువతరం న్యూస్:
మండల పరిధిలోని బినిగేరి గ్రామ కొండలలో శ్రీగిరి క్షేత్రం శివనామ శరణములతో మార్మోగింది ఆదివారం శ్రీ పంచ లింగేశ్వర స్వామి ఆలయ నిర్వాహకులు శ్రీనివాస నాయన రమాదేవి దంపతుల ఆధ్వర్యంలో 21 మందికి శివ స్వాములకు ఇరుముడి కట్టారు. ముందుగా శ్రీ పంచలింగేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి శివ స్వాములకు ఇరుముడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివ స్వాములు 41 రోజు శివమాలను ధరించి ఎంతో భక్తి శ్రద్ధలతో శివమాలను నియమ నిష్టలతో పూజలను కొనసాగించి శివ స్వాముల ఇరుముడి కట్టుకొని తలపై ఉంచి శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనానికై బయలుదేరి వెళ్లారు. శివమాల ధరించి 41 వ రోజు ఉదయం సాయంత్రం నియమ నిష్టతో పూజలు చేయడం వల్ల ఎంతో పుణ్యం కలుగుతుందన్నారు. శివ స్వాములు ఇరుముడి కట్టుకొని గ్రామ పూర వీధులలో శివనామ శరణములతో ఎంతో భక్తి శ్రద్ధలతో శివుని తపిస్తూ శివ స్వాములు ఊరేగింపుగా సాయిబాబా దేవాలయం వరకు వచ్చి శ్రీశైలం దర్శనానికి బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో శివ స్వాములు సర్పంచ్ వెంకటేష్, నాగరాజు, మూకన్నా, మూర్తి, రాఘవేంద్ర, తదితరులు పాల్గొన్నారు.



