ANDHRA PRADESHPOLITICSSTATE NEWS

వైసీపీ నేతల సంస్కారానికి అంబటి రాంబాబు వ్యాఖ్యలే నిదర్శనం

అంబటి దూషణలపై ఎమ్మెల్యే దగ్గుపాటి ఆగ్రహం

వైసీపీ నేతల సంస్కారానికి అంబటి రాంబాబు వ్యాఖ్యలే నిదర్శనం

అంబటి దూషణలపై ఎమ్మెల్యే దగ్గుపాటి ఆగ్రహం

ముఖ్యమంత్రి చంద్రబాబుకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్

అనంతపురం ప్రతినిధి జనవరి 21 యువతరం న్యూస్:

వైసీపీ నేతల సంస్కారానికి ఆపార్టీ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబుని తీవ్రంగా దూషించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు కాస్తయినా సభ్యతగా వ్యవహరించాలని హితవు పలికారు. ఆయన గతంలో కూడా అనేక వివాదస్పద వ్యాఖ్యలు చేశారని.. ప్రజలు తగిన బుద్ధి చెప్పినా ఇంకా మారలేదన్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి, వయసులో అంత పెద్ద వ్యక్తి గురించి ఎలా మాట్లాడుతారని నిలదీశారు. ఇప్పటికైనా ఆయన సీఎం చంద్రబాబు కి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే టీడీపీ శ్రేణులుగా తాము ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. పోలీసులు కూడా ఆయన చేసిన వ్యాఖ్యల మీద సుమోటాగా కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!