ANDHRA PRADESHDEVELOPOFFICIALSOCIAL SERVICE

ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో శ్రీగిరి గోవర్ధన చారిటబుల్ ట్రస్టు ద్వారా మెగా జాబ్ మేళా

ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో శ్రీగిరి గోవర్ధన చారిటబుల్ ట్రస్టు ద్వారా మెగా జాబ్ మేళా

వెల్దుర్తి డిసెంబర్ 18 యువతరం న్యూస్:

మండల కేంద్రమైన వెల్దుర్తి లోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణంలో బుధవారం పత్తికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్ ఆధ్వర్యంలో శ్రీగిరి గోవర్ధన చారిటబుల్ ట్రస్టు ద్వారా మెగా జాబ్ మేళా కార్యక్రమం ను మాజీ ఎంపీపీ జ్ఞానేశ్వర్ గౌడ్ నిర్వహించారు. మొదట జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్ మాట్లాడుతూ యువతి, యువకులు చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఉద్యోగం చేసుకుంటూ వెళితే సీనియార్టీ పెరుగుతుందన్నారు. తద్వారా ఇతర కంపెనీలలో మంచి సంపాదన ఆశించవచ్చున్నారు. తాను కూడా నెలకు 7 వేల జీతం తో ఉద్యోగం చేశానన్నారు. మరల కొన్ని నెలల తర్వాత మెగా జాబ్ మేళాను వెల్దుర్తిలో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డిటిఓ సురేష్, ఎంపీడీవో సుహాసినమ్మ, తహసిల్దార్ చంద్రశేఖర్ వర్మ, డిప్యూటీ తహసిల్దార్ గురు స్వామి రెడ్డి, ఏపీఓ లక్ష్మన్న, డిప్యూటీ ఎంపీడీవో రవి కిషోర్, బోయినపల్లి తెలుగుదేశం నాయకులు కోపరేటివ్ సొసైటీ మాజీ చైర్మన్ నర్సింగ్ కాంతారెడ్డి, వెల్దుర్తి మండల తెలుగుదేశం మాజీ అధ్యక్షులు, సూదేపల్లె మాజీ సర్పంచ్ జయరాముడు, బోగోలు సర్పంచ్ అమర్ నాథ్ గౌడ్, సిద్ధనగట్టు వెంకటేశ్వర్లు, పెరమల మాజీ సర్పంచ్ మధుసూదన్ రెడ్డి,రామళ్లకోట శశి,రత్నపల్లి ఆనంద్ యాదవ్, వడ్డే మహేష్, మహాత్మ జ్యోతిరావు పూలే పాఠశాల చైర్మన్ సూరి, వెల్దుర్తి బాలికల హై స్కూల్ చైర్మన్ రాజేష్, గిడ్డయ్య, హరి, సిద్ధన్న గట్టు ప్రేమ్ కుమార్, సూదేపల్లి రవి తదితరులు పాల్గొన్నారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!