ANDHRA PRADESHCRIME NEWS
ఫ్యాక్టరీ బస్సు ఢీకొని వ్యక్తి దుర్మరణం
కర్నూలు మెడికల్ కాలేజీ వద్ద ఘోర ప్రమాదం

ఫ్యాక్టరీ బస్సు ఢీకొని వ్యక్తి దుర్మరణం
కర్నూలు మెడికల్ కాలేజీ వద్ద ఘోర ప్రమాదం
కర్నూలు ప్రతినిధి డిసెంబర్ 16 యువతరం న్యూస్:
కర్నూలు నగరంలోని మెడికల్ కాలేజీ సమీపంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జయరాజ్ స్టీల్స్ ఫ్యాక్టరీకి చెందిన బస్సు అతివేగంతో వచ్చి వెనుక నుండి ఓ ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సు ఢీకొన్న ధాటికి వ్యక్తి తల నుజ్జునుజ్జయింది. మృతుడిని కర్నూలు నగరానికి చెందిన ‘చిన్న’గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.



