శ్రీ భక్త కనకదాసు విగ్రహ ఆవిష్కరణకు తరలిరండి

శ్రీ భక్త కనకదాసు విగ్రహ ఆవిష్కరణకు తరలిరండి
మాజీ జడ్పీ చైర్మన్ బత్తినవెంకటరాముడు
కర్నూలు సెప్టెంబర్ 17యువతరం న్యూస్:
కురువల ఆరాధ్య ఆధ్యాత్మిక గురువు శ్రీ భక్త కనకదాసు విగ్రహ ఆవిష్కరణకు ప్రతి ఒక్కరూ తేరాలి రావాలని మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బత్తిన వెంకట రాముడు అన్నారు.ఆంధ్ర రాష్ట్ర కురువ సంక్షేమ సంఘము వర్కింగ్ ప్రెసిడెంట్, స్థానిక బీసీ భవనం లొ జిల్లా బీసీ సంఘము అధ్యక్షులు అయిన బి. మురళి మనోహర్ గారి,జిల్లా కురువ సంక్షేమ సంఘము మరియు జాతీయ సంగోలి రాయన్న సంఘము సయుక్తంగా బుధవారం జరిపిన సమావేశంలో అక్టోబర్ 5 న తిరుపతి పట్టణంలో కురువల ఆరాధ్య ఆధ్యాత్మిక గురువు శ్రీ భక్త కనకదాసు విగ్రహా ఆవిష్కరణ,రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీమతి కురువ సవితమ్మ అధ్యర్యంలో జరగబొవు కార్యక్రమాన్ని స్థానిక ఒక రాజకీయ తాబేదారు అయిన జబ్బల శ్రీనివాసులు మరియు ఇతని దుష్ట చతుష్ఠమైన నలుగురు అనుచరులతో స్థానిక ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం నందు శ్రీమతి సవితమ్మ తో జరగబోయే కార్యక్రమం ను బహిస్కరించమని కోరడనమైనది.దీనిపై సమావేశంలో చర్చించి కురువ సంఘ నాయకులు అందరు ఏకగ్రీవంగా ఖoడిస్తు తీర్మానం చేయడమైనది. అస్సలు జబ్బల శ్రీనివాస్ కు రాష్ట్ర కురువ సంఘానికి ఎలాంటి సంబంధంలేదు.గుర్తింపు పొందిన ఏ జిల్లా సంఘము నుండి కూడా ఆయనకు సభ్యత్వం లేదు. కేవలము తన కుటుంబ అధ్యరం లొ జరుగు అక్రమ మైనింగ్ సంపాదనతో తన అక్రమ వ్యాపారనీకి ఏ రకమైన అడ్డురాకుండా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ లోని నాయకుల దగ్గర నేను మీ పార్టీ అని చెప్పుకొని రాజకీయ పబ్బం గడుపుకొనే ఒక రాజకీయ బ్రోకర్ అయినా జబ్బల శ్రీనివాస్ లు పిలుపు నిచ్చి కార్యక్రమం ను భహిస్కరించమని చెప్పడం విడ్డురం,దీనిని రాష్ట్రలోని కురువ సంఘము మరియు రాష్ట్రలోని కురువలు అందరూ త్రీవంగా ఖoడిస్తు నిరసిస్తు సదరూ జబ్బల శ్రీనివాస్ ను కురువ సమాజం నుండి వేలి వేయాలని ఈయనకు రాష్ట్రoలోని కురువలు ఎవ్వరు సహాయ సహకారాలు చేయకూడదని పిలిపునిస్తూ ఏక గ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది మరియు 05-10-2025 న తిరుపతి లో జరగబోయే కార్యక్రమనీకి రాష్ట్రoలోని కురువలందరూ హాజరు అయి మన ఆడ పడుచు అయినా శ్రీమతి సవితమ్మ నాయకత్వం ని బలపరుస్తూ సంఘీభావం తెలియజే యాలనీ కులస్తులను కోరుతూ జిల్లా కురువ సంఘము లు పిలుపునిస్తున్నాయన్నారు. ఈ సమావేశంలో గౌరవ మాజీ జడ్పీ చైర్మన్ బత్తిన వెంకట్రాముడు,సంక్షేమ సంఘము మరియు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జిల్లా బీసీ సంక్షేమ సంఘము అధ్యక్షు మురళి మోహన్ ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. శ్రీనివాస్ రావు,బండారి శ్రీనివాసులు,జాతీయ సంగోలి రాయన్న సంఘము బత్తిన కిరణ్ కుమార్,రంగస్వామి, మురళి మనోహర్,నల్లన్న, యుగంధర్,లాలు, పురుషోత్తం, చంద్ర శేఖర్ మరియు ఇతర సంఘము వారు పాల్గొన్నారు.