కర్నూలు జిల్లాలో టమోటా ప్రాసెసింగ్ యూనిట్ కు భూమి పూజ

టమోటా ప్రాసెసింగ్ యూనిట్ కు భూమి పూజ
పత్తికొండ ప్రతినిధి మార్చి 15 యువతరం న్యూస్:
పత్తికొండ మండలం దూదేకొండ రెవెన్యూ గ్రామం, కోతిరాళ్ళ గ్రామ పంచాయతీ మజారా కన్నికదిన్నె గ్రామం వద్ద రూ.11 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ టమోటా ప్రాసెసింగ్ యూనిట్ కు రాష్ర్ట పరిశ్రమలు, వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి టీజీ భరత్ ,పత్తికొండ నియోజకవర్గ శాసన సభ సభ్యులు కే.ఈ.శ్యామ్ కుమార్ భూమి పూజ నిర్వహించారు
కార్యక్రమంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు , జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ,ఏపి ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సీఈఓ డా.గెడ్డం శేఖర్ బాబు , పిడి ఉమాదేవి, ఆర్డీవో , తాసిల్దార్, వాల్మీకి కార్పొరేషన్ డైరక్టర్ బొజ్జమ్మ ,తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు తిక్క రెడ్డి, బత్తిన వెంకట్రాముడు గారు,సాంబశివరెడ్డి, తుగ్గలి నాగేంద్ర ,రాష్ట్ర కమిటీ నాయకులు,జిల్లా కమిటీ నాయకులు,మండల కమిటీ నాయకులు,గ్రామ కమిటీ నాయకులు,తదితరుల పాల్గొన్నారు.