ANDHRA PRADESHDEVELOPOFFICIAL
పన్నుల వసూళ్లకు అదనపు కౌంటర్

పన్నుల వసూళ్లకు అదనపు కౌంటర్
కర్నూలు మున్సిపాలిటీ మార్చి 19 యువతరం న్యూస్:
నగరపాలక కార్యాలయంలో ఆస్తి పన్ను, తాగునీటి కొళాయి చార్జీలు, ట్రేడ్ లైసెన్స్ రుసుముల చెల్లింపునకు, పన్ను వసూళ్ల కేంద్రం వద్ద జన తాకిడి రోజురోజుకు పెరుగుతూ వస్తుండడంతో, అదనపు కౌంటర్ ఏర్పాటు చేసినట్లు నగరపాలక కార్యాలయ మేనేజర్ యన్.చిన్నరాముడు తెలిపారు. ఈ మేరకు మంగళవారం అదనపు కౌంటర్‌ను మేనేజర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పన్ను చెల్లింపుదారులు నిరీక్షించకుండా, త్వరగా పన్నులు చెల్లించేందుకు వీలుగా అదనపు కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నగర ప్రజలు నగరపాలక కార్యాలయంలోనే కాకుండా, సంబంధిత సచివాలయంలో, ఆన్‌లైన్‌లో సైతం ఆస్తి పన్ను, తాగునీటి చార్జీలను చెల్లించవచ్చన్నారు. కార్యక్రమంలో ఆర్ఐ భార్గవ్, సిబ్బంది వినోద్, తారక్ తదితరులు పాల్గొన్నారు.