ప్రతి విద్యార్థి ‘ఈగల్’ కు బ్రాండ్ అంబాసిడరే

ప్రతీ విద్యార్ది ఈగల్ కు బ్రాండ్ అంబాసిడరే
ఎపి ఈగల్ ఐజి ఆకే రవి కృష్ణ, ఐపిఎస్.
కెఎల్ యులో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా హాజరయి ప్రసంగించిన రవికృష్ణ , ఐపిఎస్.
మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడం అందరి భాధ్యత అని రాష్ట్ర మాదక ద్రవ్యాల రవికృష్ణ ఐపిఎస్ అన్నారు. సోమవారం నాడు వడ్డేశ్వరంలోని కెఎల్ డీమ్డ్ యూనివర్శిటీలో ఏర్పాటు చేసిన మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరయి ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నేరాలు జరిగిన తరువాత కేసులు కట్టడం కంటే నేరాలు జరగకుండా నివారించడమే అత్యంత ముఖ్యమని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. అందులో బాగంగా కెఎల్ వర్శిటీలో కూడా నిర్వహించినట్లు పేర్కొన్నారు. విద్యార్దులను కూడా ఈగల్ కార్యక్రమాలలో భాగస్వామ్యం చేసేందుకు ప్రణాళిక సిద్దం చేసినట్లు తెలిపారు. మంచి అలవాట్లు అలవరచుకోవడం ప్రతీ విద్యార్ధి కర్తవ్యమని సూచించారు. అందుకోసం ప్రతీ విద్యార్ది తమకు సహకారం అందించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ను మాదక ద్రవ్యాలు లేకుండా తీర్చి దిద్దేందుకు ప్రతీ విద్యార్ది ఈగల్ కు బ్రాండ్ అంబాసిడరేనని అన్నారు. ఎంతో పచ్చదనం మద్యలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న కెఎల్ విశ్వవిద్యాలయంలో చదువుకునే అవకాశ్ రావడం విద్యార్దుల అదృష్టమని అన్నారు. ప్రతీ విద్యార్ది తమ వయస్సు గల వారు ఎవరైనా మాదక ద్రవ్యాల బారిన పడిన సందర్బంలో వారికి (ఈగల్) ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూఫ్ ఫర్ లా ఎన్ ఫోర్స్ మెంట్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 గురించి వారికి తెలియజేయాలని కోరారు. తమను ఆశ్రయించిన మాదక ద్రవ్యాల బారిన పడిన బాదితులకు కౌన్సిలింగ్ నిర్వహించి వారిని మాదక ద్రవ్యాల బారి నుండి కాపాడుతామని ఆయన తెలిపారు.
గుంటూరు జిల్లా ఎస్పి సతీష్ కుమార్ ఐపిఎస్ మాట్లాడుతూ విద్యార్దులందరూ మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే దుష్పలితాల గురించి అవగాహన పెంచుకుని ఇతరులకు తెలియజేయాలని కోరారు. గంజాయి కేసులో అరెస్టు అయిన వారిని నేరస్తులుగా జీవిత కాలంపాటు గుర్తింపు కలిగి ఉంటారని తెలిపారు. ఎవరైనా ఇతర దేశాలు వెళ్లాలనుకునే వారు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి విక్రయించిన వారికి, వినియోగించిన వారికి ప్రత్యేకమైన సెక్షన్ల ద్వారా శిక్షలు ఉంటాయని తెలిపారు. గంజాయి వినియోగిస్తున్న వారి సమాచారం ఉంటే తమకు తెలియజేయాలని కోరారు.
వర్శిటీ రాజిస్ట్రార్ డాక్టర్ కె.సుబ్బారావు మాట్లాడుతూ తమ వర్శిటీలో ఎటువంటి ర్యాగింగ్ లేకుండా ప్రతీ విద్యార్ధి ఎంతో సంతోషంగా, భద్రంగా ఉంటున్నారని తెలియజేయడానికి సంతోషిస్తున్నామన్నారు. మాదక ద్రవ్యాలను నివారించడంలో తమ విద్యార్దులు అన్ని విదాలుగా పోలీసులకు సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా ఎస్పి సతీష్ కుమార్ ఐపిఎస్, ఈగల్ ఎస్పీ నగేష్, గుంటూరు నార్త్ జోన్ డిఎస్పీ సిహెచ్. మురళీ కృష్ణ, తాడేపల్లి సీఐ కళ్యాణ్ రాజు, రిజిస్ట్రార్ డాక్టర్ కె.సుబ్బారావు, విద్యార్ధి సంక్షేమ విభాగం ఇంచార్జి డీన్ డాక్టర్ కెఆర్ఎస్.ప్రసాద్, సలహాదారు డాక్టర్ హబీబుల్లా ఖాన్, అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీధర్, ఎన్ సిసి లెప్టినెంట్ పావని తదితరులు పాల్గొన్నారు.